Payal Rajput Kidney Infection పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ సమస్యలతో బాధపడుతోంది. నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉండటంతోనే ఇలా కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ సోకిందట. అందుకే ఇలా సెలైన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఈ ఆర్ఎక్స్ 100 బ్యూటీ వాపోయింది. హెల్త్ సహకరించకపోయినా కూడా సెట్‌కు వస్తోందట. షూటింగ్ చేస్తోందట. ఆమె ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
పాయల్ రాజ్‌పుత్‌కు ఆర్ఎక్స్ 100 సినిమాతో లైఫ్ ఇచ్చాడు అజయ్ భూపతి. అంతకు ముందు పాయల్ హిందీ సీరియల్, పంజాబీలో సినిమాలు చేసినా కూడా అంత గుర్తింపు రాలేదు. కానీ టాలీవుడ్లో మాత్రం మొదటి సినిమాతోనే అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లామర్ ఒలకబోయడం, అందాల ప్రదర్శన మాత్రమే కాకుండా.. నటిగానూ అందరినీ ఆకట్టుకుంది. ఇందు పాత్రకు ప్రాణం పోసినట్టుగా పాయల్ నటించింది.
అయితే పాయల్ రాజ్‌పుత్‌కు మళ్లీ ఇంత వరకు ఒక్క హిట్ కూడా రాలేదు. నటిగా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. కానీ కమర్షియల్ హిట్ కొట్టడంలో పాయల్ వెనకపడింది. దీంతో మళ్లీ తన డైరెక్టర్‌నే నమ్ముకుంది పాయల్. అజయ్ భూపతి సైతం మహా సముద్రంతో చేతులు కాల్చుకున్నాడు.
పాయల్ ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. జిన్నా అంటూ గత ఏడాది డిజాస్టర్ సినిమాను ఖాతాలో వేసుకున్నట్టు అయింది. ఇప్పుడు పాయల్ చేస్తోన్న సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి. మామూలుగా అయితే పాయల్ కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతోంది. బోల్డ్ ఫోటో షూట్లు చేయడంతో ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. ఒక మంచి హిట్ సినిమాలో నటించి పాయల్ వార్తల్లోకి ఎక్కడం ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఇప్పుడు అయితే పాయల్ క్షేమంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. చికిత్స అయిపోయిందంటూ.. ఇప్పుడు పర్వాలేదన్నట్టుగా పాయల్ పోస్ట్ వేసింది.
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook