Modi on Kashmir Files: నిజాలు చూపించారంటూ.. కశ్మీర్​ ఫైల్స్ మూవీపై ప్రధాని ప్రశంసలు!

Modi on Kashmir Files: విడుదలకు ముందే అనేక వివాదాలు చుట్టుముట్టిన మూవీ కశ్మీర్​ ఫైల్స్. ఇప్పుడు ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ మూవీని పొగిడారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 03:34 PM IST
  • కశ్మీర్​ ఫైల్స్ మూవీపై ప్రధాని పొగడ్తలు
  • ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని పిలుపు
  • గొప్పగా ఉందంటూ దర్శకుడికి ప్రశంసలు!
Modi on Kashmir Files: నిజాలు చూపించారంటూ.. కశ్మీర్​ ఫైల్స్ మూవీపై ప్రధాని ప్రశంసలు!

Modi on Kashmir Files: ఎన్నో వివాదాల నడుమ థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కశ్మీర్​ ఫైల్స్​ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలన్నారు. భారతీయ జనతా పార్టి (బీజేపీ) పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన మోదీ కశ్మీర్ ఫైల్స్​ సినిమా గురించి ప్రస్తావించారు.

ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న నిజాన్ని ఈ సినిమా బహిర్గతం చేసిందన్నారు ప్రధాని. కశ్మీర్​ ఫైల్స్ దర్శకుడిపై కూడా మోదీ ప్రశంసలు కురిపించారు.

ఏమిటి ఈ సినిమా ప్రత్యేకత?

1990 కశ్మీర్​లో పిండిట్​లపై జరిగిన దాడుల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. హిందువులపై అల్లరి మూఖలు తుపాకులతో దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రాణాలు కాపాడపుకునేందుకు పండిట్లు కశ్మీర్​లో తమ ఇళ్లను, ఆస్తులను వదిలి వలసలు వెళ్లారు. అలాంటి వ్యక్తుల కన్నీటి గాధలను సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు వివేక్​ అగ్ని హోత్రి.

అనుపమ్​ఖేర్​, దర్శన్​కుమార్​. మిథున్​ చక్రవర్తి, పల్లవీ జషీ, చిన్మయ్ మండ్లేకర్​, ప్రకాశ్​ బేల్వాడీ సహా పలువురు ఈ సినిమాలో నటించారు.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. భావోద్వేగంగా స్పందిస్తున్నారు. సినిమాలోని డైలాగ్స్​ ప్రతి ఒక్కటి మనస్సును తాకుతాయని చెబుతున్నారు. ఇక ఈ మూవీపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ పిలపునిస్తున్నారు.

Also read: Rashmika Mandanna: యువ హీరోతో రష్మిక మందన్న రొమాన్స్.. సూపర్ కాంబో!!

Also read: Shivam Sharma: అమ్మ స్నేహితురాలితో బెడ్‌ షేర్‌ చేసుకున్నా.. క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News