Pooonam Pandey: భర్త అరెస్టు...ఆస్పత్రిలో నటి పూనమ్ పాండే!

Pooonam Pandey: భర్త కొట్టాడంటూ..బాలీవుడ్ నటి పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 12:34 PM IST
Pooonam Pandey: భర్త అరెస్టు...ఆస్పత్రిలో నటి పూనమ్ పాండే!

Poonam Pandey: ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే(Poonam Pandey) భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను తీవ్రంగా కొట్టినందుకు శామ్(Sam Bombay)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పూనమ్‌‌కు తల, కళ్లతోపాటు మొహంపై గాయలయ్యాయి. తనను దారుణంగా కొట్టాడని.. భర్త శామ్ బాంబేపై స్వయంగా పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. 

తీవ్ర గాయాలపాలైన పూనమ్‌ ప్రస్తుతం ఆసుపత్రి(Hospital)లో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్‌1న పూనమ్‌-శామ్‌ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్‌ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది. అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది.

Also Read: Jai Bhim controversy: కమ్యునల్ సింబల్ విషయంలో 'జై భీమ్'పై మరో వివాదం

తాజాగా మరోసారి శామ్‌ బాంబే చేసిన దాడిలో పూనమ్‌(Punam injury) తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్‌ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News