Salaar OTT Platform: కేజిఎఫ్ లాంటి సెన్సేషనల్ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా సలార్. ప్రభాస్ హీరోగా చేసిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక వాటిని అందుకుంటూ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండో భాగం కూడా త్వరలోనే మొదలుకానుంది.
తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే పలుమార్లు సలార్ సినిమాని థియేటర్‌లో చూసిన అభిమానులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక వారందరికీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒక శుభవార్త చెప్పింది. 'సలార్'ను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అనగా ఈ సినిమా ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ముందుగా నిర్ణయించుకున్న దాన్ని బట్టి అయితే ఈ చిత్రం జనవరి 26న గణతంత్రదినోత్సవం రోజున ఓటీటీలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అందరికీ బిగ్ షాక్ ఇస్తు ఎవరూ ఊహించిన రీతిలో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ చేసింది. దాదాపు ఆరు రోజుల ముందే ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసింది. థియేటర్స్ మొత్తం సంక్రాంతి సినిమాలకే సరిపోవడం తో... ఇక ఎలాగైనా సలార్ సినిమా రన్ ముగిసిపోయింది అన్న ఉద్దేశంతో ఈ చిత్ర మేకర్స్ అలానే నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకో ఉండొచ్చు అని అందరూ భావిస్తున్నారు.
ఖాన్సారా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ ఎక్సలెంట్ యాక్షన్‌కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సూపర్ టాలెంట్ తోడు కావడంతో ఈ సినిమా బిగ్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మొన్న బెంగళూరులో ఘనంగా నిర్వహించారు ఈ సినిమా యూనిట్. కాగా సలార్ సీక్వెల్ సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ
Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter