Kalki 2898 AD Box Office Closing Collection: ‘కల్కి’ మూవీ తెలుగు వెర్షన్ టోటల్ కలెక్షన్స్.. మొత్తంగా ఎన్ని కోట్ల ప్రాఫిట్ అంటే..

Kalki 2898 AD Hindi Box Office Collections:  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓన్లీ తెలుగు వెర్షన్ లో ఎంతో బిజినెస్ చేసింది. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 28, 2024, 09:58 AM IST
Kalki 2898 AD Box Office Closing Collection: ‘కల్కి’ మూవీ తెలుగు వెర్షన్ టోటల్ కలెక్షన్స్.. మొత్తంగా ఎన్ని కోట్ల  ప్రాఫిట్ అంటే..

Kalki 2898 AD Hindi Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి స్టోరీ పడితే.. ఎలా ఉంటుందో మరోసారి ‘కల్కి’ చిత్రంతో ప్రూవ్ అయింది. ఈ సినిమా మన దేశంలో బుక్ మై షోలో అత్యధిక టికెట్టు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై ఆగష్టు 15కు 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. మరోవైపు ఈ సినిమా ఈ నెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

ప్రభాస్ విషయానికొస్తే.. బాహుబలి సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు.
తాజాగా ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని నిర్మాతకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాగా ‘కల్కి 2898 ఏడి’ నిలిచింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ రూ. 1000 కోట్లకు గ్రాస్ వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 248 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ  వ్యాప్తంగా ఓన్లీ తెలుగు వెర్షన్ విషయానికొస్తే.. రూ. 200 కోట్ల షేర్ (రూ. 315 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా  కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 40 కోట్ల షేర్  ఓవర్సీస్ కలిపి రూ. 92 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 332 కోట్ల షేర్ (రూ. 575 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టింది. అంతేకాదు తెలుగు వెర్షన్ లో దాదాపు రూ. 82 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.

మొత్తంగా హిందీలో థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 64.85 కోట్ల లాభాలను కొల్లగొట్టింది. ‘కల్కి 2898 AD’ సినిమా ఇప్పటి వరకు రూ. 1182 కోట్ల గ్రాస్ (రూ. 582 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా మీద అన్ సీజన్ లో విడుదలైన ‘కల్కి’ మూవీ  ఆకట్టుకునే కథ, కథనం ఉంటే.. ఏ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టడం  ‘కల్’కి మూవీ మరోసారి ప్రూవ్  చేసింది.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News