Prabhas - Kannappa: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యేది అపుడేనా.. ?

Prabhas - Bhakta Kannappa: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలో కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప'లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ షూటింగ్‌లో జాయిన్ అయ్యే డేట్ ఖరారైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 31, 2024, 12:59 PM IST
 Prabhas - Kannappa: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యేది అపుడేనా.. ?

Prabhas - Bhakta Kannappa: అవును ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సిరీస్‌ తర్వాత ఆ రేంజ్ సక్సెస్.. గతేడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700  కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సలార్ మూవీ ప్రముఖ ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ మినహా తెలుగు, ఇంగ్లీష్ మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ మాత్రం డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు మే 13న ఉండటంతో ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు ప్రభాస్.. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తోన్న 'కన్నప్ప'లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.

'కన్నప్ప' సినిమాలో మహా శివుడి వేషం వేస్తున్నాడు ప్రభాస్. గతంలో తన పెదనాన్న కృష్ణంరాజు హీరోగా  'భక్త కన్నప్ప' సినిమాలో నటించారు. ఆయన కూడా ప్రభాస్‌తో కన్నప్ప సినిమాను రీమేక్ చేయాలనున్నారు. తీరా ఆ ప్రాజెక్ట్ మంచు విష్ణు చేతిలోకి వెళ్లింది. ఆయన ఈ సినిమాలో మహా దేవుడి పాత్రకు ఇంపార్టెంట్ ఉండటం.. ఆ క్యారెక్టర్‌ కోసం ప్రభాస్‌ను సంప్రదించడం జరిగింది. ఇక మంచు విష్ణుతో స్నేహంతో పాటు అటు పెదనాన్న కోరికను మన్నించినట్టు అవుతుందని ఎంతో బిజీగా ఉన్నా ఈ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హిందీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఇక ప్రభాస్.. ఈనెల 12 నుంచి ఓ వారం రోజులు పాటు డేట్స్ అడ్జస్ట్ చేసినట్టు సమాచారం. గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ'లో ప్రభాస్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. కన్నప్పలో నటించేందుకు ప్రభాస్ ఎలాంటి పారితోషకం తీసుకోవడం లేదనేది సమాచారం.  

ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రభాస్.. కల్కి, కన్నప్పలతో పాటు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌' మూవీలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తున్నాడు. అటు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం చేయనున్నాడు.

Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News