MAA Elections 2021: 'మా' ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.. ప్రత్యర్థులపై మాటల తూటాలు, సవాళ్లతో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.
'మా' ఎన్నికల (MAA Elections) వివాదాలు మరింత ముదురుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ (Praksh Raj), ఈ రోజు మంచు విష్ణు ప్యానల్ (Manchu Vishnu Panel) పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులైన జీవితా (Jeevitha), శ్రీకాంత్ (Hero Srikanth) లతో కలిసి, మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల నియామావళిని ఉల్లగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
Also Read: T20 World Cup 2021: టీమిండియాకు ఆ సత్తాలేదు.. ఈ సారి మాదే విజయం: అబ్దుల్ రజాక్
ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ "మా ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో (POstal Ballot) దుర్వినియోగం జరుగుతుంది, 60 ఏళ్లు పై బడిన మా సభ్యులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు కానీ మంచు విష్ణు ప్యానల్ ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. మంచు విష్ణు (Machu Vishnu) మరియు వారి ప్యానల్ కలిసి 60మందితో పోస్టల్ బ్యాలెట్లో తమకు అనుకూలంగా ఓటు వేయించుకుంటున్నారు.
అంతేకాకుండా, మంచు విష్ణు ప్యానల్ కు చెందిన ఒక వ్యక్తి నిన్న సాయంత్రం 56 మంది సభ్యుల తరఫున రూ.28వేలు కట్టారు. ఆయన కడితే ఎలా తీసుకున్నారు..? కృష్ణ (Hero Krishna), కృష్ణంరాజు (Krishnam Raju), శారద, పరుచూరి బ్రదర్స్ (Paruchuti Brothers), శరత్‌బాబు వంటి సభ్యుల పోస్టల్ డబ్బులు కూడా మంచు విష్ణు ప్యానల్ కు చెందిన వ్యక్తి కాట్టారు. ఇలానా ఎన్నికలు జరిపే పద్దతి.. ?? ఇంత దిగజారుతారా..? హామీలు ఇచ్చి గెలవరా...?? అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఈ విషయం పై చిరంజీవి, నాగార్జున, కృష్ణం రాజు (Chiranjeevi, Krisham Raju, Nagarjuna) వంటి పెద్దలు సమాధానం చెప్పాలి అని ప్రకాష్ రాజ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Also Read: India Corona Cases: దేశంలో కొత్తగా 18,346 కేసులు...209 రోజుల్లో ఇదే కనిష్ఠం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి