Project K Director Nag Ashwin : మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా తెలుగు తెరపై ముద్ర వేశాడు. సెన్సిబుల్ డైరెక్టర్ అంటూ నాగ్ అశ్విన్‌కు మంచి క్రేజ్ ఉంది. సినిమాల గురించి తప్పా ఇంకేం మాట్లాడని నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే పనుల్లో బిజీగా ఉన్నాడు. మామూలుగా బయట ఎక్కువగా కనిపించని నాగ్ అశ్విన్ తాజాగా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ కోసం బయటకు వచ్చాడు. శుక్రవారం జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ సందడి చేశాడు.
వెంకట్ కళ్యాణ్ హీరోగా అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చెడ్డి గ్యాంగ్ తమాషా చిత్రం రాబోతోంది. అయితే సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్‌తో పాటు అతని తల్లి డాక్టర్ జయంతి కూడా పాల్గొన్నారు. టీజర్ లాంచ్ తరువాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాతకు తమకు ఉన్న రిలేషన్ గురించి చెప్పాడు.
తమ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులైన నిర్మాత క్రాంతి కిరణ్, వారి యంగ్ టీమ్ తీసిన చెడ్డి గ్యాంగ్ తమాషా టీజర్ చాలా బాగుందని మెచ్చుకున్నాడు. చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ తేడా ఉండదని, ఏ సినిమా అయినా ఒకటే అని చెప్పుకొచ్చాడు. కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నాడు.
క్రాంతి కిరణ్ చెప్పినట్టు ఒక సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం అంటే మనిషి పుట్టుకతో సమానమని అన్నాడు.ఒక తల్లి గర్భం దాల్చి నవమాసాలు మోసి జన్మనిచ్చే వరకు పడే తపనే సినిమా అంటూ ఎంతో గొప్పగా కొనియాడాడు నాగ్ అశ్విన్..ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఎవడే సుబ్రహ్మణ్యం గుర్తుకు వస్తుందని అన్నాడు.ఆ సినిమాలాగే ఈ చెడ్డి గ్యాంగ్ తమాషా విజయం సాధించాలని కోరుకున్నాడు.
నాగ్ అశ్విన్ తల్లి డాక్టర్ జయంతి రెడ్డి మాట్లాడుతూ సినిమా టీం కు అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. అడిగిన వెంటనే వచ్చిన నాగ్ అశ్విన్‌కు థాంక్స్ తెలిపారు. కొత్త టీంతో తాము తీసిన ఈ సినిమా కంటెంట్ నాలుగు గంటల వస్తే దానిని 2 గంటల 40 నిమిషాలకు తగ్గించడానికి గర్భశోకాన్ని అనుభవించామని ఎమోషనల్ అయ్యాడు. మంచి కథతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది తన పదిహేనేళ్ల కల అని చెప్పుకొచ్చాడు. తనకు ఇష్టమైన దర్శకుడు నాగ్ అశ్విన్ గారు వచ్చి సినిమా టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. నిర్మాత క్రాంతి కిరణ్ నన్ను నమ్మి హీరోగా, దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నాడని, అందుకు థాంక్స్ అని అన్నాడు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని నవ్వించే హాస్య భరితమైన చిత్రంగా ఉంటుందని అన్నాడు.
Also Read : Jambalakidi jaaru Mitaya : జంబలకిడి జారు మిఠాయా.. నవ్వులు పూయించిన అషూ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook