Pushpa 2 Sooseki: పుష్ప 2 సెకండ్ లిరికల్.. మెలోడియస్ సాంగ్ తో అదరగొట్టిన అల్లు అర్జున్, రష్మిక

Pushpa 2: పుష్ప 2  సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి విడుదలైన సెకండ్ లిరికల్.. ప్రస్తుతం ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.. ఈ పాట గురించి పూర్తి వివరాలు మీకోసం..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 29, 2024, 11:56 AM IST
Pushpa 2 Sooseki: పుష్ప 2 సెకండ్ లిరికల్.. మెలోడియస్ సాంగ్ తో అదరగొట్టిన అల్లు అర్జున్, రష్మిక

Pushpa 2 Second Lyrical:  అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా పుష్ప 2. బ్లాక్ బస్టర్ సినిమా పుష్పకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే విరుదలైన టీజర్ అలానే ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్ప.. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్ప.. 10 కోట్లకు పైగా సంపాదించుకొని యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ వీడియో.. చూసేకి.. కూడా త్వరలోనే విడుదల చేయనున్నామని ప్రకటించారు చిత్ర యూనిట్. ఇక మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ ని విడుదల చేశారు. ఈ  పాట ని మొదటి నుంచి కపుల్ సాంగ్ అంటూ చెబుతూ వచ్చారు సినిమా యూనిట్. కాగా ఇప్పుడు ఈ పాట లిరిక్స్ వింటే ఇది నిజంగానే కపుల్ కి ఫేవరెట్ సాంగ్ అయ్యేలా అనిపిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక సింపుల్ స్టెప్స్ తో.. ఎంతో మెలోడియస్ మ్యూజిక్ తో.. వినసంపైన లిరిక్స్ తో ఈ పాట అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఇక చంద్రబోస్ రాసిన ఈ పాటను సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళీ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అయితే గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో ..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఊ అంటావా మావ పాటతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి కూడా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉండనుందని.. కానీ ఇప్పుడు సమంత కాకుండా త్రిప్తి డిమ్రీని తీసుకువస్తున్నట్లు సమాచారం.

 

 

Also read: New Rules from June: జూన్ నుంచి ఈ అంశాల్లో భారీ మార్పులు, మీ బడ్జెట్‌పై ప్రభావం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News