Karwa Chauth Funny Meme: భార్య ఏం చూస్తుంది, భర్త ఏం ఆలోచిస్తాడంటే! 

Raj Kundra Funny Post On wife Shilpa Shetty Kundra | తన భర్త కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భార్యలు ఈరోజు ఉపవాస దీక్షను చేపడుతారు. అయితే కర్వా చౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టి కుంద్రా (Shilpa Shetty Kundra)పై మంచి జోక్ పేల్చారు.

Last Updated : Nov 4, 2020, 06:05 PM IST
Karwa Chauth Funny Meme: భార్య ఏం చూస్తుంది, భర్త ఏం ఆలోచిస్తాడంటే! 

నేడు కర్వా చౌత్ (Karwa Chauth 2020) పండుగ. దక్షిణాదిలో ఈ పండుగ ప్రస్తావన అంతగా ఉండదు కానీ, ఈ సమయంలో అట్లతద్దిని నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో కర్వా చౌత్‌ను ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు కర్వా చౌత్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. నేటి రాత్రి ఏడున్నర గంటల సమయంలో కర్వా చౌత్ జరుపుకుంటున్నారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేస్తారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడ చాటు నుంచి తెరగా చేసుకుని భర్త ముఖాన్ని చూస్తారు. 

 

తన భర్త కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భార్యలు ఈరోజు ఉపవాస దీక్షను చేపడుతారు. సాయంత్రం చంద్రుడి వెలుగులో జల్లెడ నుంచి భర్త ముఖాన్ని చూసిన తర్వాతే ఉపవాస దీక్ష విరమించి ఆహారం తీసుకుంటారు. అయితే కర్వా చౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టి కుంద్రా (Shilpa Shetty Kundra)పై మంచి జోక్ పేల్చారు. అది శిల్పాశెట్టితో పాటు మహిళలకు వర్తించేలా ఫన్నీ మీమ్ వదిలారు. కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

 

జల్లెడ నుంచి భార్య తన ముఖాన్ని చూస్తున్న ఫొటోలను రాజ్‌కుంద్రా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. దాని ప్రకారం .. భార్య తన ముఖాన్ని చూస్తూ, తన గురించి ఆలోచిస్తుందని భర్తలు భావిస్తారు. వాస్తవానికి, ఆమెకు జల్లెడ నుంచి భర్త ముఖం చూస్తుంటే.. తనకు తినవలసిన పదార్ధాలు గుర్తుకొస్తాయని’ ఫన్నీగా ట్వీట్ చేశారు రాజ్‌కుంద్రా. ప్రతి ఏడాది శిల్పాశెట్టితో కలిసి భర్త రాజ్‌కుంద్రా ఉపవాసం ఉంటారట. ఇది పద్ధతి కాదు, ఇలా ఆడవారిని హేళన చేయవద్దని నెటిజన్లు స్పందిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News