RRR Movie: సన్‌సెట్ సర్కిల్ బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా, రాజమౌళికీ అవార్డు

RRR Movie: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో ఘనత దక్కించుకుంది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా ఎన్నికైంది. అటు రాజమౌళికి కూడా అరుదైన అవార్డు లభించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2022, 04:41 PM IST
RRR Movie: సన్‌సెట్ సర్కిల్ బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా, రాజమౌళికీ అవార్డు

సినిమా విడుదలైనప్పటి నుంచి సంచలనాలు నమోదు చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులు గెల్చుకుంటుంది. ఇప్పుడు మరో అరుదైన అవార్డు సాధించి..చర్చనీయాంశమైంది. 

ఆస్కార్ అవార్డు రేసులో లేకపోయినా అంతర్జాతీయ సినిమా దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమా. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. ఈ విభాగంలో మరో 4 అంతర్జాతీయ సినిమాలు పోటీపడగా..ఆర్ఆర్ఆర్ సినిమా విన్నర్‌గా ఎంపికైంది. ఇక ఉత్తమ దర్శకత్వం విభాగంలో ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి రన్నరప్‌గా నిలిచాడు. విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్న ఈ సినిమా ఇప్పుడు సన్‌సెట్ సినిమా అవార్డు గెల్చుకోవడంతో మరోసారి ఖ్యాతినార్జించింది.

ఇటీవల జపాన్ దేశంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడి బాక్సాఫీసులో అధ్భుతమైన కలెక్షన్లు సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ తదుపరి టార్గెట్ ఆస్కార్ అవార్డేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇండియా నుంచి బెస్ట్ ఫారన్ ఫిల్మ్ కేటగరీ కోసం ఏ సినిమా కూడా రాకపోవడం విశేషం.

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, శ్రేయా శరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటించగా..ఆలిసన్ దూడీ, రే స్టీవెన్‌సన్‌లు ప్రతినాయకులుగా నటించారు.

Also read: Veera Simha Reddy : సెట్‌లో బాలయ్య ఆగ్రహం.. దెబ్బకు డుమ్మా కొట్టేశాడట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News