Raju Yadav OTT Streaming: గెటప్ శ్రీను అభిమానులకు శుభవార్త.. ప్రముఖ ఓటీటీలో ‘రాజు యాదవ్’ స్ట్రీమింగ్..

Raju Yadav OTT Streaming: గెటప్ శ్రీను కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా జబర్ధస్త్ కమెడియన్స్ అందరూ హీరోలుగా ప్రమోషన్ పొందారు. ఈ కోవలో గెటప్ శ్రీను హీరోగా తెరకెక్కిన మూవీ ‘రాజు యాదవ్’. ఇప్పటికే థియేట్రికల్ గా ఓ మోస్తరుగా ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 25, 2024, 02:52 PM IST
Raju Yadav OTT Streaming: గెటప్ శ్రీను అభిమానులకు శుభవార్త.. ప్రముఖ ఓటీటీలో ‘రాజు యాదవ్’ స్ట్రీమింగ్..

Raju Yadav OTT Streaming: ‘రాజు యాదవ్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఎపుడు నవ్వుతూ  ఉండే లోపంతో బాధపడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతను ఎలాంటి ప్రాబ్లెమ్స్ ను ఫేస్ చేసాడనే ఇతివృత్తంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మొత్తంగా మలయాలంలో సినిమాల్లో లాగే చాలా నాచురల్ గా ఈ సినిమాను మొదటి నుంచి చివరి నిమిషం వరకు రియలిస్టిక్ గా తెరకెక్కించారు. అంతేకాదు ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా లవ్ పేరుతో వెంటపడే కొద్ది మంది ప్రేమికుల గురించి వింటూనే ఉంటాము. కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై దాడులకు పాల్పడటం వంటివి చూస్తూనే ఉన్నాము. మరికొన్ని సార్లు ప్రేమించలేదనే బాధతో దేవదాసులుగా మారిపోతుంటారు. అలాంటి నిజ జీవిత ఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’.

మొత్తంగా అంతగా ఆలోచనలు లేని ఓ యువకుడి లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా హీరో స్నేహితులుతో సరదాలతో సాగిపోతూ ఉంటుంది. అందులో మధ్య తరగతి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ సినిమాలో చూపించారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో హీరో ముఖానికి బాల్ తగిలాక మార్పు రావడం.. ఆ నేపథ్యంలో వచ్చే కామెడీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది.

ధ్వితీయార్థం లోనే అసలు ట్విస్ట్ ఉంది.  తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సీన్స్ తో సినిమా మొత్తం సాగిపోతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మిడిల్ క్లాస్ కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలు కట్టిపడేస్తాయి.

గెటప్ శ్రీను కెరియర్  తన కెరీర్ లో మంచి నటనను కనబరిచాడు. ముఖం  మీద ఎప్పుడు నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. ఫస్టాఫ్ లో  నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన శ్రీను..సెకండాఫ్ లో  నవ్వుతూనే భావోద్వేగాలని పండించడం విశేషం. దర్శకుడు కృష్ణమాచారి ఒక రియల్ స్టోరీని తీసుకొని, దాన్ని అంతే రియలిస్టిక్ గా తెరకెక్కించాడు. సినిమాలో చివరి 20 నిమిషాలు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెలిపెడుతాయి. ఎమోషన్ ని తెరకెక్కించిన విధానం  దర్శకుడిని తప్పకుండ అభినందిచాల్సిందే. ఈ సినిమాలో గెటప్ శ్రీనుకు జోడిగా అంకిత్ కరత్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News