Rakul Preet Singh Wedding: డిఫరెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. తరలివచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీస్

Rakul Preet Singh and Jackky Bhagnani Wedding: తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొద్దిరోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రకుల్ తాజాగా తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 05:43 PM IST
Rakul Preet Singh Wedding: డిఫరెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. తరలివచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీస్

Rakul Preet Singh and Jackky Bhagnani Wedding Videos:

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రార్థన క్యారెక్టర్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన రకుల్ తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటున్న టైంలో తన దృష్టిని హిందీ వైపు మళ్ళించింది. హిందీలో కూడా మొదట్లో మంచి అవకాశాలు అందుకున్న రకుల్ కి విజయాలు అయితే పెద్దగా రాలేదు. దాంతో ఈ మధ్య వెబ్ సిరీస్ వైపు కూడా దృష్టి పెట్టింది. కాగా సినిమాలతోనే కాకుండా ఈ మధ్య రకుల్ తన లవ్ విషయం వల్ల కూడా న్యూస్ లో నిలుస్తూ వచ్చింది.

 

నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఈ హీరోయిన్ గత కొద్దిరోజులుగా ప్రేమగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటిగా ఆనంద్‌ కరాజ్‌ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగ్గా జరిగింది.  ఇక ఆ తరువాత వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు. ఇలా రెండు పద్ధతిలు ఫాలో అయ్యి రెండు విధాల పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు.. ఈ జంట.

 

కాగా ఈనెల 19వ తేదీ నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకి బాలీవుడ్ సెలబ్రిటీ సైతం ఎంతో మంది అటెండ్ అయ్యారు. హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్‌ శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్‌ సెలబ్రిటీస్ తో పాటు టాలీవుడ్‌ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా బాలీవుడ్ తారలు ఎక్కువగా ఈ పెళ్లికి అటెండ్ అవ్వడంతో.. వాళ్లు గోవా ఎయిర్ పోర్టులో దిగగానే మీడియా వారు సెలబ్రిటీస్ వీడియోలు తీయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపించారు. 
నిన్న మొన్న జరిగిన ఫంక్షన్స్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ డాన్సులు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జాకీ భగ్నానీతో తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్‌లో బయటపెట్టింది. అప్పటినుంచి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రకుల్ ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ కాసాగాయి. ఇన్ని సంవత్సరాలకు ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ ఇండియన్‌ 2 సినిమా చేస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్‌ పండగకు థియేటర్లలో రిలీజ్‌ కావడానికి సిద్ధంగా ఉంది.

Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన

Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x