Ram Charan: మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ట్విట్టర్ లో అడుగు పెట్టిన తరువాత తన ఫ్యాన్స్ కోసం మంచి మంచి విషయాలు షేర్ చేస్తున్నాడు. 

Last Updated : Sep 11, 2020, 06:54 PM IST
    • మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ లో అడుగు పెట్టిన తరువాత తన ఫ్యాన్స్ కోసం మంచి మంచి విషయాలు షేర్ చేస్తున్నాడు.
    • తండ్రి, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
Ram Charan: మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ట్విట్టర్ లో అడుగు పెట్టిన తరువాత తన ఫ్యాన్స్ కోసం మంచి మంచి విషయాలు షేర్ చేస్తున్నాడు. తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటిస్తున్న సినిమా అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో (Social Media ) షేర్ చేస్తుంటాడు.

మరో వైపు రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana Kamineni ) కూడా నలుగురి మంచి కోరే విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా రామ్ చరణ్ తన తల్లి సురేఖ కొణిదెల ఫోటోను షేర్ చేశాడు. ఇందులో ఆమె తులసి ( Basil -Tulsi ) పూజ చేస్తున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తున్న సమయంలో మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత ( బాధ్యత ) అని రాశారు రామ్ చరణ్.

ఈ ఫోటో చూసిన తరువాత అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. రామ్ చరణ్ ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడు అని పొగుడుతున్నారు. కొంత మంది రామ్ చరణ్ సంస్కారానికి, మన భారతీయ కల్చర్ పై ఉన్న అభిమానానికి ఫిదా అయిపోతున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం మంచి సంస్కారంగా ఉన్నారు అని కొంత మంది కామెంట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం #RRR  చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో జూ.ఎన్టీర్ మరో హీరోగా కనిపించనున్నాడు. 

Trending News