Ram Charan Multistarrer: సీతారామం డైరెక్టర్ కొత్త సినిమాలో రామ్ చరణ్.. ఆ హీరోతో కలిసి సందడి!

Ram Charan Multistarrer again : ఇప్పటికే హీరోగా పలు మల్టీస్టారర్ సినిమాలు చేసిన రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాలో మెరిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 31, 2023, 04:25 PM IST
Ram Charan Multistarrer: సీతారామం డైరెక్టర్ కొత్త సినిమాలో రామ్ చరణ్.. ఆ హీరోతో కలిసి సందడి!

Ram Charan Multistarrer with Suriya: రామ్ చరణ్ తేజకు మల్టీస్టారర్ సినిమాలు కొత్తవి కాదు, అప్పట్లో ఎవడు, ఈ మధ్య ఆచార్య అలాగే ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ఆయన తన ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతోనే కాదు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరోతో కూడా నటించాడు. ఇప్పుడు ఆయన ముందుకి ఒక ఆసక్తికరమైన మల్టీస్టారర్ ప్రాజెక్టు వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే ఇటీవల సీతారామం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హను రాఘవపూడి నటుడు సూర్యతో ఒక సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సూర్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కథ నేరేట్ చేయమని చెప్పారట. హను కథ చెప్పగా, ఆ కథలో హీరో పాత్రతో పాటు మరో కీలక పాత్ర ఉంటుందని ఆ కీలక పాత్రకు ఎవరిని తీసుకుంటున్నారు అని ప్రశ్నించగా ఇంకా ఎవరిని ఫిక్స్ అవ్వలేదని హను రాఘవపూడి వెల్లడించారట.

తనకు కథ నచ్చిందని, అలాగే ఆ పాత్రకు రాంచరణ్ ను తీసుకుంటే బావుంటుందని సూర్య సూచించడంతో హను రాఘవపూడి కూడా నిజంగానే ఆ పాత్రకు రాంచరణ్ అయితే కరెక్ట్ గా సూటవుతాడని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే త్వరలోనే రామ్ చరణ్ ను కలిసి ఈ విషయాన్ని ఆయన వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15 సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు.

అయితే రామ్ చరణ్ గనుక ఒప్పుకుంటే సూర్య-హను సినిమా కూడా మరో భారీ పాన్ ఇండియా మూవీ అవడం ఖాయం. రాంచరణ్ కెరియర్ కి ఉపయోగ పడడం ఖాయం అని అంచనాలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్తో కలిసి ఎవడు అనే సినిమా చేయగా తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య అనే సినిమా చేశారు. ఇక ఇటీవల నందమూరి తారక రామారావు జూనియర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేయగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరి సూర్యతో కాంబినేషన్ సినిమా అంటే రామ్ చరణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరి.

Also Read: Taraka Ratna Latest Photo From ICU: ఆసుపత్రిలో ఐసీయూ బెడ్‌పై తారకరత్న ఫోటో వైరల్!

Also Read: SSMB 28 Digital Rights: డిజిటల్ రైట్స్ తోనే ఆ ముగ్గురి రెమ్యునరేషన్ క్లియర్.. ఏమన్నా క్రేజా ఇది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News