RC15: ఆ వార్తలు నిజం కాదు… జాగ్రత్త.. ఆర్సీ 15 టీం కీలక ప్రకటన!

Ram Charan's RC15 makers alerts fake casting call: రామ్ చరణ్ RC15 సినిమాలో నటింప చేస్తామంటూ కొంతమంది నటీనటులను అప్రోచ్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుతానికి తాము ఎవరిని ఆ పని కోసం నియమించలేదని తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2022, 07:35 PM IST
RC15: ఆ వార్తలు నిజం కాదు… జాగ్రత్త.. ఆర్సీ 15 టీం కీలక ప్రకటన!

Ram Charan's RC15 makers alerts fake casting call: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు. ఇప్పటికే విశ్వంభర,  అధికారి వంటి పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. కానీ ఏ పేరు ఫిక్స్ చేస్తారో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఈ సినిమాని రామ్ చరణ్ 15వ సినిమా అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50వ సినిమా అనే పేర్లతో ప్రస్తావిస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళ,  హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. అదేమిటంటే ఈ సినిమాలో నటింప చేస్తామంటూ కొంతమంది నటీనటులను అప్రోచ్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుతానికి తాము ఎవరిని ఆ పని కోసం నియమించలేదని తెలిపింది. ఎవరో కేటుగాళ్లు తమ సినిమా పేరు వాడుకుంటూ తమ సినిమాలో నటింప చేస్తామంటూ అప్రోచ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. 

ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక అలర్ట్ నోట్ జారీ అయింది. సో దిల్ రాజు రామ్ చరణ్ సినిమాలో నటించాలంటే ప్రస్తుతానికి అవకాశం లేదనే చెప్పాలి. నిజానికి ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ సినిమాలో నటింప చేస్తామంటూ కేటుగాళ్లు ప్రచారం మొదలుపెట్టారనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,  శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. రోబో 2.0 సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శంకర్ ఈ సినిమా చేస్తూ ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ తరువాత ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న రాం చరణ్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: Karan Johar: నయనతారను అలా అవమానించాలా.. కరణ్ జోహార్ పై అభిమానుల ఫైర్

Also Read: Anasuya bharadwaj:ఎట్టకేలకు జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై.. ఆ ప్రశ్నకు మౌనమే సమాధానం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News