Ram Gopal Varma: రాజకీయ నాయకులపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు, Opinion Poll

Ram Gopal Varma On Kumbh Mela | తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో వెనకడుగు వేయని ఆర్జీవీ ప్రస్తుతం చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈసారి ఏకంగా రాజకీయ నేతలు, ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 16, 2021, 03:08 PM IST
Ram Gopal Varma: రాజకీయ నాయకులపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు, Opinion Poll

Ram Gopal Varma On Kumbh Mela: విలక్షణతకు మరోపేరుగా నిలిచే వ్యక్తులతో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకరు. తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో వెనకడుగు వేయని ఆర్జీవీ ప్రస్తుతం చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈసారి ఏకంగా రాజకీయ నేతలు, ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో కరోనా వైరస్ రెండో దశ కొనసాగుతున్నందున పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మాస్కులు ధరించడం తప్పని చేశాయి. లేనిపక్షంలో బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించకుండా కనిపించిన వారికి రూ.1000 జరిమానా విధించేలా కోవిడ్19 నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా నిర్వహించడంపై రాజకీయ నాయకులను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ప్రశ్నించారు. భౌతికదూరం పాటించాలని  సూచిస్తున్నారు, జరిమానాలు సైతం విధిస్తున్నారు. సరే, కుంభమేళా లాంటివి నిర్వహించి సోషల్ డిస్టాన్సింగ్‌కు భంగం కలిగించిన ఉత్తరాఖండ్ సీఎంకు ఎంత జరిమానా విధించాలని ప్రశ్నించారు.

Also Read: Black Widow Trailer: అవెంజర్స్ ఫేమ్ స్కార్లెట్ జాన్సన్ బ్లాక్ విడో తెలుగు ట్రైలర్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఎంత జరిమానా విధించాలో చెప్పాలంటే ఓపీనియన్ పోల్ నిర్వహించారు. ట్విట్టర్‌లో రెండు ఆప్షన్లతో పోస్ట్ చేశారు. ఫేస్ మాస్కులు(Face Masks) ధరించపోతే సామాన్యులకు జరిమానా విధిస్తున్నారు. కానీ కుంభమేళా లాంటివి నిర్వహిస్తున్న వారికి 10 కోట్ల రూపాయాలు, లేదా 1000 కోట్ల రూపాయాలు జరిమానా విధించాలా అంటూ నెటిజన్ల మీదకి ప్రశ్నను వదిలారు రామ్ గోపాల్ వర్మ. అంతటితో ఆగకుండా కుంభమేళాలు, రాజకీయ పార్టీల ర్యాలీలు ప్రజల కోసం కాదని, వారి ఓట్ల కోసమేనని నిరూపిస్తున్నాయని, ప్ర జలు ఓట్లు వేసిన తరువాత వారు చనిపోయినా రాజకీయ నాయకులు పట్టించుకోరని డైరెక్టర్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News