Ranbir Kapoor: ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్..నేను చీటర్ నే..ఒప్పుకున్న రణబీర్..!

Ranbir Kapoor Labelled Cheater: నేను గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాను. అయితే చివరికి అదే నా గుర్తింపుగా మారింది. కాసనోవా, చీటర్ అనే ట్యాగ్స్ వచ్చి పడ్డాయి. ముఖ్యంగా నా జీవితంలో చాలా భాగం నేను మోసగాడు అనే గుర్తింపుతోనే జీవించాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా నాకు కొంతమంది ఆ ట్యాగ్ ను  ఆపాదిస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు రణబీర్ కపూర్. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 21, 2024, 04:41 PM IST
Ranbir Kapoor:  ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్..నేను చీటర్ నే..ఒప్పుకున్న రణబీర్..!

Ranbir Kapoor about his Past Love Stories: తాజాగా పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రణబీర్ కపూర్  వ్యక్తిగత ,వృత్తిపరమైన విషయాలను పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా చీటర్ అనే ట్యాగ్ తనపై రావడం గురించి మాట్లాడారు. ‘నేను గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాను .అయితే చివరికి అదే నా గుర్తింపుగా మారింది. కాసనోవా, చీటర్ అనే ట్యాగ్స్ వచ్చి పడ్డాయి. ముఖ్యంగా నా జీవితంలో చాలా భాగం నేను మోసగాడు అనే గుర్తింపుతోనే జీవించాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా నాకు కొంతమంది ఆ ట్యాగ్ ను  ఆపాదిస్తున్నారు,’ అంటూ ఎమోషనల్ అయ్యారు రణబీర్ కపూర్. 

స్టార్ హీరోయిన్స్ తో రణబీర్ గతంలో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. ఆ స్టార్ హీరోయిన్స్ విషయంలోనే ఇప్పటికీ తాను చీటర్ అనే బిరుదును తగిలించుకున్నానని బాధపడ్డారు. ఇకపోతే తర్వాత తన కూతురు రాహా అలాగే తన తండ్రి రిషి కపూర్ గురించి కూడా మాట్లాడారు రణబీర్ కపూర్.. తండ్రి గురించి మాట్లాడుతూ.. ‘మా నాన్నకు కోపం ఎక్కువ.కానీ ఆయన చాలా మంచి మనిషి. చిన్న తనంలో నేను ఆయనతో మాట్లాడాలంటే ఎంతో భయపడేవాడిని. ముఖ్యంగా ఆయన కళ్ళల్లోకి నేను చూసేవాడిని కాదు. ఇప్పటికీ కూడా ఆయన కళ్ళ రంగు ఎలాంటిదో కూడా నాకు తెలియదు. ఆయన ముందు నిల్చున్నానంటే తలదించుకొని ఉండేవాడిని. ఆయనంటే అంత భయం నాకు. అయితే ఆయన మరణాంతరం ఆ బాధను జీర్ణించుకోలేకపోయాను. ఆయన చెప్పిన ఏ విషయానికి కూడా నేను ఎదురు తిరిగి సమాధానం చెప్పలేదు. ఆయన మరణం మా జీవితాల్లో తీరని లోటు మిగిల్చింది,’ అంటూ ఎమోషనల్ అయ్యారు రణబీర్ కపూర్. 

కూతురు రాహా గురించి మాట్లాడుతూ .. ‘రాహ రాక మా జీవితాల్లో ఆనందం నింపింది. ప్రస్తుతం ఆమె మా ప్రపంచం అయ్యింది.. షూటింగ్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఎంతో బిజీగా ఉన్నా సరే రాహాతో కొద్దిసేపు సమయం గడిపితే చాలు ఆ శ్రమ అంతా ఇట్టే పోతుంది అంటూ కూతురిపై ప్రేమ వలకబోస్తూ పలు కామెంట్లు చేశారు రణబీర్ కపూర్. ఇకపోతే  గత ఏడాది తాను ప్రేమించిన ఆలియా భట్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే .ఇక వీరి ప్రేమ బంధానికి గుర్తుగా వివాహమైన ఆరు నెలలకే రాహా జన్మించింది. ఇకపోతే పెళ్లికి ముందే గర్భవతి అయిన అలియా భట్ వివాహం తరువాత కూతురుకి జన్మనిచ్చి పెళ్లికి ముందు తాను గర్భవతి అయ్యానని ఇటీవలే వెల్లడించింది కూడా. ఇక ప్రస్తుతం రణబీర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Also Readఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News