Rashmika Mandanna About Marriage: రష్మిక మందనకు అలాంటి వాడు కావాలట

Rashmika Opinion on Marriage: పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రష్మికకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్‌ వచ్చింది. వరుష సినిమాల్లో దూసుకెళ్తోన్న క్రష్మిక.. తాజాగా ప్రేమ.. పెళ్లి తదితర విషయాలపై తన మనస్సులోని మాటల్ని బయటపెట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 10:53 PM IST
  • పుష్ప మూవీతో రష్మికకు పెరిగి ఫాలోయింగ్
  • లవ్‌, రిలేషన్‌షిప్‌, పెళ్లిపై స్పందించిన రష్మిక
  • లవ్ అనేది రెండు వైపులా ఉండాలన్న నేషనల్ క్రష్
  • అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానన్న క్రష్మిక..
 Rashmika Mandanna About Marriage: రష్మిక మందనకు అలాంటి వాడు కావాలట

Rashmika Opens Up On Love: టాలీవుడ్‌లో రష్మిక మందన వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఛలో మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు తెచ్చుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రిలీజైన పుష్ప మూవీతో రష్మికకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. 

ఇక రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగుతుండగా.. వాటన్నింటినీ వీరు ఇద్దరూ కొట్టిపారేశారు. అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ వీరిద్దరూ చాలా సార్లు చెప్పుకొచ్చారు. 

రష్మిక అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో తన మనస్సులోని మాటలను చెప్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక లవ్‌, రిలేషన్‌షిప్‌, తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలనే విషయాలను బయటపెట్టింది. తన దృష్టిలో ప్రేమ అనేది మాటల్లో వర్ణించలేనిదని ఈ అమ్మడు చెప్పింది. అది కేవలం ఫీలింగ్స్‌కు సంబంధించినటువంటి విషయమని తెలిపింది. లవ్ అనేది రెండు వైపులా ఉంటేనే ఆ రిలేషన్‌ ముందుకు కొనసాగుతుంది అని తన అభిప్రాయం చెప్పింది.

పెళ్లి గురించి కూడా రష్మిక మందన తన మనస్సులోని మాటల్ని చెప్పింది. తాను ప్రస్తుతం చాలా చిన్నదాన్ని అని.. అందుకే పెళ్లి గురించి ఎలా ఆలోచించాలో తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లికి సంబంధించినటువంటి ఆలోచనల్ని తన మనస్సులోకి రానివ్వడం లేదని రష్మిక పేర్కొంది. ఇక తనను ప్రేమగా... సురక్షితంగా చూసుకునే వాళ్లనే తాను పెళ్లి చేసుకుంటానని రష్మిక మందన తన మనస్సులోని మాటను రివీల్ చేసింది. 

రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు త్వరలోనే రిలీజ్‌ కానుంది. పుష్ప.. ది రూల్‌ మూవీతో పాటు పలు సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి. రష్మిక మందన రెండు బాలీవుడ్ మూవీలకు కూడా ఒకే చెప్పింది. మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ భామ జతకట్టనుంది. గుడ్ బైలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి రష్మిక నటించనుంది.

Also Read: IND vs WI 1st ODI LIVE*: రోహిత్ మెరుపులు.. సూర్య క్లాస్ ఇనింగ్స్! తొలి టీ20లో భారత్ ఘన విజయం!!

Also Read: Guntur : మైనర్ బాలిక అత్యాచారం కేసులో 64 మంది అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News