Rashmika Mandanna: ఒక పనికిరాని వాడిని నమ్మడం భయంకరం.. రష్మిక షాకింగ్ కామెంట్స్

Rashmika Mandanna Twitter: సోషల్ మీడియాలో రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమాపై.. బోలెడు మీన్స్ చూసే ఉంటాం. అయితే తాజాగా అలాంటి ఒక మీమ్ కి.. స్వయంగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న.. అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.   

Written by - Vishnupriya | Last Updated : Jun 13, 2024, 08:20 PM IST
Rashmika Mandanna: ఒక పనికిరాని వాడిని నమ్మడం భయంకరం.. రష్మిక షాకింగ్ కామెంట్స్

Rashmika Mandanna reacts to Animal Meme: గతేడాది బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన యానిమల్ సినిమా.. బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. అనిల్ కపూర్, తృప్తి దిమ్రి కీలక పాత్రలలో కనిపించారు.

Add Zee News as a Preferred Source

ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు.. సినిమా మీద బోలెడు విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాకుండా అప్పట్లో సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా వచ్చాయి. అయితే తాజాగా.. ఇప్పుడు అలాంటి ఒక మీమ్ కి స్వయంగా రష్మిక మందన్న.. రిప్లై ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా కథ విషయానికి వస్తే.. నిన్ను ఎప్పటికీ మోసం చేయను.. అని చెప్పి రష్మిక మందన్న ని పెళ్లి చేసుకున్న రన్బీర్ కపూర్.. సెకండ్ హాఫ్ లో తృప్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 

తాజాగా దీని మీద ఒక మీమ్ ట్విట్టర్ లో కనిపించింది. రన్బీర్ కపూర్.. రష్మిక మందన్నతో నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను అంటున్న.. ఫోటోను పెట్టి పైన అబ్బాయిలను నమ్మడం కంటే ఇంకేది భయంకరంగా ఉండదు.. అంటూ మీమ్ వచ్చింది. అయితే దానికి రష్మిక మందన్న ఇప్పుడు అదిరిపోయే రిప్లై ఇచ్చింది. 

"కరెక్షన్: ఒక పనికిరాని వాడిని నమ్మడం భయంకరం. కానీ బయట చాలామంది.. మంచి మగవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళను నమ్మడం స్పెషల్" అంటూ రష్మిక మందన్న ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చి.. అందరు దృష్టిని ఆకర్షించింది. తాజాగా రష్మిక చేసిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 

అయితే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి ట్వీట్ పెట్టింది అని, ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ చాలా మంచివాడు అని కితాబు ఇస్తోంది అంటూ.. కొందరు కామెంట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమయడం నడుస్తుంది అని వార్తలు.. అయితే వినిపిస్తున్నాయి కానీ.. ఇద్దరు అధికారికంగా ఒప్పుకోలేదు. ఏదేమైనా విజయ్ దేవరకొండ తో రష్మిక మందన్న చాలా సంతోషంగా ఉంది అని.. ఈ రిప్లై చూస్తేనే తెలుస్తోంది అని మరి కొందరు చెబుతున్నారు. 

ఇక సినిమాల పరంగా చూస్తే రష్మిక మందన్న త్వరలోనే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. ఈ సినిమా మాత్రమే కాకుండా రష్మిక చేతిలో ఇంకా కొన్ని పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News