Rashmika Mandanna Responds : కుక్కకి టికెట్ల వార్తపై రష్మిక స్పందన.. దానికి ఇష్టం లేదట!

Rashmika Mandanna Responds to Dog Flight Ticket Rumors: రష్మిక మందన్నా ఇటీవల తన కుక్క పిల్లకు కూడా విమాన టికెట్లు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె స్పందించారు. ఆమె ఈమేరకు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 02:09 PM IST
  • కుక్క పిల్లకు ఫ్లైట్ టికెట్స్ డిమాండ్ చేశారంటూ రష్మిక మీద ప్రచారం
  • ఆసక్తికరంగా స్పందించిన రష్మిక
  • నవ్వు ఆగడం లేదంటూ కామెంట్
Rashmika Mandanna Responds : కుక్కకి టికెట్ల వార్తపై రష్మిక స్పందన.. దానికి ఇష్టం లేదట!

Rashmika Mandanna Responds to Dog Flight Ticket Rumors: కన్నడ నాట పుట్టి కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తర్వాత చలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ లోనే టాప్ హీరోయిన్ లలో ఒకరిగా స్థానం సంపాదించింది. ఆమె చేస్తున్న అన్ని సినిమాలు వరుస హిట్లుగా నిలుస్తున్న క్రమంలో ఆమెకు ఎనలేని క్రేజ్ లభిస్తుంది. ఆ మధ్య నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు పొందిన ఆమె ఈ మధ్య కొ౦న్దరు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నది అంటూ కథనాలు బయటకు వచ్చాయి. 

ఈ మధ్యనే ఆమె ఒక పిల్లను కొనుక్కుని దానికి ఆరా అని పేరు కూడా పెట్టింది. ఆమె తనతో పాటు షూటింగ్ కి తీసుకు వెళ్లేందుకు ఆరాకి కూడా ఫ్లైట్ టికెట్ లు డిమాండ్ చేస్తుందనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే సాధారణంగా ఇలాంటి విషయాల మీద హీరోలుగానీ, హీరోయిన్లు గానీ స్పందించారు. కానీ ఆ విషయం మీద రష్మిక మందన్న స్పందించింది. ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అందులో ఒక వెబ్సైట్ కథనాన్ని షేర్ చేసిన ఆమె అది నిజం కాదని కొట్టిపారేశారు.

''కమాన్ మరీ ఇంత సిల్లీగా ఉండకండి, నిజంగా మీరు ఆరా(రష్మిక పెంపుడు కుక్క) నాతో పాటు ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నా ఆమె మాత్రం నాతో ట్రావెల్ చేయాలని అనుకోదు, ఆమెకు హైదరాబాద్ లో ఉండటమే చాలా ఇష్టం'' అంటూ పేర్కొంది. అయితే ఆ తర్వాత మరోసారి ట్వీట్ చేస్తూ క్షమించండి ఇది చూసి నేను నవ్వు ఆపుకోలేక పోతున్నాను అని ఆమె పేర్కొంది. అది చూసిన ఒక నెటిజన్   ఇది మాత్రమే కాదు మేడం..మీగురించి ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయని పేర్కొన్నాడు.

అతడి కామెంట్స్‌పై రష్మిక స్పందిస్తూ ‘ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నాకు తెలియజేయండి ప్లీజ్‌’ అని పేర్కొంది. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ సరసన యానిమల్‌ మూవీతో పాటు వంశీపైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న వరిసు(వారసుడు) సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన మరో రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
Also Read: Kiara Advani: సారీ చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు.. నాకు ప్రేమే ముఖ్యం: కియారా అడ్వాణీ

Also Read: Vikram Rare Feat: కమల్ మాస్.. లెక్కలు మాములుగా లేవుగా.. అరుదైన రికార్డులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News