Rashmika Mandanna : విజయ్ దేవరకొండ తమ్ముడి బర్త్ డే.. రష్మిక విషెస్ వైరల్

Rashmika Mandanna Wishes To Anand Deverakonda రష్మిక మందాన్న తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విజయ్ దేవరకొండ తమ్ముడి బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపింది. ఆనంద్ దేవరకొండకు రష్మిక చెప్పిన విషెస్‌ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 11:24 AM IST
  • ఆనంద్ దేవరకొండ బర్త్ డే
  • రష్మిక స్పెషల్ విషెస్
  • దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ తమ్ముడి బర్త్ డే.. రష్మిక విషెస్ వైరల్

Rashmika Mandanna Wishes To Anand Deverakonda రష్మిక మందాన్న దేవరకొండ ఫ్యామిలీతో క్లోజ్‌గానే మూవ్ అవుతూ ఉంటుంది. దేవరకొండ ఇంట్లో జరిగే ఈవెంట్లకు కూడా రష్మిక హాజరవుతుంటుంది. ఇక విజయ్, రష్మికలు కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. కానీ ఎక్కడా కూడా పబ్లిక్‌గా ఈ విషయం మీద ఓపెన్ అవ్వరు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ వీటిపై ఏనాడూ ఈ జంట క్లియర్‌గా ఓపెన్ అవ్వలేదు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ రూమర్లపై స్పందిస్తుంటారు.

రష్మిక అయితే విజయ్ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆనంద్ దేవరకొండతోనూ క్లోజ్‌గానే ఉంటుంది. విజయ్ దేవరకొండ అమ్మతోనూ కనిపిస్తుంటుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లోనూ ఈ ఫ్యామిలీతోనే కనిపిస్తుంటుంది రష్మిక. అయితే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా రష్మిక విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే ఆనంద్ దేవరకొండ అంటూ ఫన్నీగా ఎమోజీని షేర్ చేసింది. దీనికి ఆనంద్ రిప్లై ఇస్తూ.. థాంక్యూ రష్ అని అనేశాడు.

ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం బేబీ అనే సినిమాతో బిజీగా ఉన్నా సంగతి తెలిసిందే. బేబీ సినిమాతో మరోసారి ప్యూర్ లవ్ స్టోరీతో అందరినీ మెప్పించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ హైవే, పుష్పక విమానం సినిమాలు సోసోగా నడిచిన సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమానే ఆనంద్ దేవరకొండకు సరైన హిట్టుగా నిలిచింది. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా అది అంతగా క్లిక్ అవ్వలేదన్న సంగతి తెలిసిందే.

ఇక రష్మిక ఇప్పుడు తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. పుష్ప ది రూల్ తప్పా మరో సినిమా ఆమె చేతిలో లేదు. బాలీవుడ్ సినిమాలన్నీ బెడిసి కొట్టేస్తున్నాయి. కోలీవుడ్‌లోనూ రష్మికకు మొండిచెయ్యే ఎదురువుతోంది. కన్నడలో రష్మికను తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు రష్మికకు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదనిపిస్తోంది.

Also Read:  Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!

Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News