Ravi Teja in Daaku Maharaju: ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. జనవరి 12, 2025న చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్నిచోట్ల ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ ను రవితేజ చెప్పబోతున్నట్లు సమాచారం.
అంతేకాదు రవితేజ వాయిస్ ఓవర్ సినిమాపై బలమైన ముద్రను వేయబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ సినిమాతో కచ్చితంగా బాలయ్య అభిమానులకు దర్శకుడు ఫుల్ మీల్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా పై సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా, చాందిని చౌదరి మరో హీరోయిన్గా కూడా అవకాశం దక్కించుకున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా... బాబీ డియోల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే కార్యక్రమానికి బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఈయన ఆడియన్స్ కు తెలియని ఎన్నో కొత్త విషయాలను అభిమానులకు పరిచయం చేశారు.
ఇకపోతే రవితేజ విషయానికి వస్తే.. తన కెరీర్ ను కేవలం సినిమాలపైనే ఫోకస్ చేశారు. వరుస చిత్రాలతో హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు రవితేజ. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు ఇతర స్టార్ హీరోల సినిమాలలోని పాత్రలకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు.
Also read: Heavy Rains: నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి