మాస్ మహారాజ రవి తేజ ( Ravi Teja ) పోలీస్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్, క్రాక్ సినిమా ( krack movie ) డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. కేవలం రెండు వారాల షూటింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబరులో క్రాక్ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. క్రాక్ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే విడుదల అవుతుందని గతంలోనే అనేక ఊహాగానాలు వినిపించాయి. ఏదేమైనా, ఆ చిత్ర నిర్మాతలు అప్పట్లోనే OTT విడుదలపై ఊహాగానాలను కొట్టిపారేశారు.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో ఇటీవల కాలంలో చాలామంది నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్టుగా ఓటిటిపై ప్రీమియర్ చేయడానికే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రాక్ సినిమా సైతం OTT ప్లాట్‌ఫామ్‌పైనే విడుదల కానున్నట్టు మరోసారి వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై ఈ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ( Gopichand Malineni ) మరోసారి స్పందించారు. క్రాక్ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల చేయనున్నట్లు గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. క్రాక్ సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని కోరుకునే మాస్ మహారాజ అభిమానులందరికీ ఈ ట్వీట్ సంతోషపరిచిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ కొవిడ్-19 ప్రస్తుత పరిస్థితిని చూస్తోంటే.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పడం మాత్రం కష్టంగానే ఉంది.
#krack in Theaters only 🔥🔥 pic.twitter.com/19wjlPGQ4S
— Gopichandh Malineni (@megopichand) August 14, 2020
క్రాక్ సినిమాలో రవి తేజ సరసన శృతి హాసన్ ( Shruti Hassan ) జంటగా కనిపించబోతుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తుండగా ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.