Renu Desai Aadya : ప్రతీ ఏడాది ఆ సమయం కోసం ఎదురుచూస్తా.. రేణూ దేశాయ్ వీడియో వైరల్

Renu Desai Food Habits రేణూ దేశాయ్ సోషల్‌ మీడియాలో తాజాగా షేర్ చేసిన పోస్ట్ ద్వారా ఆమెకు ఏవేవీ ఇష్టమో తెలిసి వచ్చింది. ప్రతీ ఏడాది వాటి కోసం ఎదురుచూస్తుందట. ప్రతీ ఏటా డిసెంబర్‌లో అవి దొరుకుతాయట.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 08:32 PM IST
  • నెట్టింట్లో రేణూ దేశాయ్ సందడి
  • ఆద్యతో కలిసి ఢిల్లీ వీధుల్లో హల్చల్
  • పచ్చి బఠానీలు తినే అలవాటుపై రేణూ దేశాయ్
Renu Desai Aadya : ప్రతీ ఏడాది ఆ సమయం కోసం ఎదురుచూస్తా.. రేణూ దేశాయ్ వీడియో వైరల్

Renu Desai Aadya video రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం రేణూ దేశాయ్ తన బిడ్డ ఆద్యతో కలిసి చక్కర్లు కొడుతోంది. న్యూ ఇయర్ స్పెషల్ అంటూ కాశ్మీర్ ట్రిప్‌లో బాగానే ఎంజాయ్ చేసింది. మంచు కురిసే ప్రాంతంలోకి తీసుకెళ్లమని ఆద్య కోరిందట. అందుకే ఇలా గుల్మర్గ్ ఏరియాకు వెకేషన్ ప్లాన్ చేసినట్టుగా రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

ఇక అక్కడ చలికి తట్టుకోలేక ఆద్య తెగ కష్టాలు పడిందట. నువ్వే కదా అడిగావ్ .. ఇప్పుడు బాగుందా? అన్నట్టుగా రేణూ దేశాయ్ కౌంటర్లు వేసింది. ఆద్య చలికి వణుకుతున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది రేణూ దేశాయ్. అయితే ఇప్పుడు రేణూ దేశాయ్, ఆద్యలు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

రేణు దేశాయ్‌కు పచ్చి బఠానీలు అంటే చాలా ఇష్టమట. ప్రతీ ఏటా డిసెంబర్‌ కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తుందట. ఎందుకంటే ఆ కాలంలోనే పచ్చి బఠానీల పంట చేతికొస్తుందని, అవి ఎంతో రుచికరంగా ఉంటాయని, అవి మొత్తం ఎన్ని పెట్టినా కూడా తినేస్తానని, ఇలా ఖాళీ చేస్తానని, అయిపోయాక ఎంతో బాధగా ఉంటుందని వీడియోలో రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

ఆ వీడియోను ఆద్య తీసిందని, తాను చివరకు ఇలా కెమెరామెన్‌గా మారిపోయిందంటూ సెటైర్లు వేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమాల విషయానికి వస్తే రేణూదేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తోంది. రవితేజ నటిస్తున్న ఈ చిత్రంలో రేణూ దేశాయ్ హేమలతాలవణం అనే పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే జరిగే షెడ్యూల్స్‌లో రేణూ దేశాయ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News