Nayanthara Marriage: సరోగసీ వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆరేళ్ల క్రితమే నయనతార పెళ్లి.. పిల్లల్ని కన్న మహిళ ఎవరంటే?

Nayantara and Vignesh Sivan married befor 6 years: నయనతార- విగ్నేష్ దంపతులు సరోగసీ వ్యవహారంలో చిక్కుల్లో పడే అవకాశం ఉండనే వాదన వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 16, 2022, 10:27 PM IST
Nayanthara Marriage: సరోగసీ వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆరేళ్ల క్రితమే నయనతార పెళ్లి.. పిల్లల్ని కన్న మహిళ ఎవరంటే?

Nayantara and Vignesh Sivan married befor 6 years: నయనతార, విగ్నేష్ శివన్ సరోగసి వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరి వివాహం జూన్ నెలలో జరగగా కొద్ది రోజుల క్రితం తాము ఇద్దరు మగ బిడ్డలకు తల్లిదండ్రులమయ్యామని వారు ప్రకటించారు.  వీరు ఇలా తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారో లేదో వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఎందుకంటే వీరు జూన్ నెలలోనే పెళ్లి చేసుకుంటే ఈలోపే పిల్లలు పుట్టడం అసాధ్యం.

నయనతార ఇటీవల కూడా కొన్ని సందర్భాలలో బయటకు వచ్చినప్పుడు ఆమెకు గర్భం దాల్చిన దాఖలాలు ఏమీ కనిపించలేదు. దీంతో వారు సరోగసి ద్వారా పిల్లలను కని ఉంటారని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే జనవరి నెలలో భారతదేశం తీసుకువచ్చిన కొత్త సరోగసీ చట్టం ప్రకారం వీరిద్దరూ కనుక సరోగసి ద్వారా ఇప్పుడు పిల్లల్ని కంటే ఖచ్చితంగా అది ఇల్లీగల్ అవుతుంది. ఐదేళ్లదాకా శిక్ష పడే విధంగా కూడా చట్టంలో పేర్కొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది.

తమిళనాడు హెల్త్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం కూడా ఈ విషయం మీద ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక ముగ్గురు మెంబర్లతో కూడిన కమిటీ నియమించింది. ఈ కమిటీ వారం రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ వ్యవహారం మీద ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నయనతార, విగ్నేష్ శివన్ ని విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే నయనతార, విగ్నేష్ శివన్ ఈ వ్యవహారాన్ని లీగల్ గానే ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏకంగా ఆరేళ్ల క్రితమే మ్యారేజ్ రిజిస్టర్ అయినట్లుగా ఉన్న ఒక డాక్యుమెంట్ కూడా వారు సబ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. యితే ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన తర్వాత అధికారికం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఏదైనా ఒక జంట సరోగసికి వెళ్ళాలి అంటే ఐదేళ్లపాటు పిల్లలు పుట్టక పోతే మాత్రమే సరోగసి అనే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో తమకు పెళ్లి ఆరేళ్లయినా పిల్లలు పుట్టలేదు కాబట్టే తాము సరోగసి ద్వారా ముందుకు వెళ్లామని ఈ జంట చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాక ఈ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఎవరు అనే విషయం మీద కూడా క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు. దుబాయిలో సెటిల్ అయిన ఒక మలయాళీ మహిళకు జన్మనిచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాక ఏ  హాస్పిటల్ అయితే ఆమె బిడ్డలకు జన్మనిచ్చిందో ఆ హాస్పిటల్ వివరాలు కూడా నయనతార దంపతులు అందజేసినట్లు టాక్ వినిపిస్తోంది.    

Also Read: Rangasthalam Golden Chance: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రంగస్థలం మేకర్స్.. అలా చేసుంటేనా వేరే రేంజ్ అంతే!

Also Read: Nandamuri Tejaswini Cine Entry: సినీ రంగ ప్రవేశానికి సిద్దమైన బాలయ్య చిన్న కూతురు.. అంతా రెడీ కానీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News