John Abraham: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంపై మండిపడుతున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్

John Abraham: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. తెలుగు సినిమాను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2022, 03:52 PM IST
John Abraham: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంపై మండిపడుతున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్

John Abraham: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. తెలుగు సినిమాను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. 

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం వర్సెస్ ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ వివాదం నడుస్తోంది. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు..తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని దిగజార్చుతూ మాట్లాడటంపై జాన్ అబ్రహంపై అంతా మండిపడుతున్నారు. సలార్ సినిమాలో నటిస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జాన్ అబ్రహం ఇలా సమాధానమిచ్చాడు. నేను ఓ హిందీ హీరోని..రీజనల్ హీరో కాదు. తెలుగుతో పాటు ఏ విధమైన ప్రాంతీయ సినిమాలు ఎప్పుడూ చేయను..డబ్బుల కోసం వేరే భాషా చిత్రాల్లో, తెలుగు సనిమాల్లో చేయనని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రియులతో పాటు దక్షిణాది సినిమా అబిమానులు కూడా మండిపడుతున్నారు. 

జాన్ అబ్రహం నటించిన ఎటాక్ సినిమా ఏప్రిల్ 1వ తేదీన విడుదలైంది. కలెక్షన్లపరంగా చూస్తే ఆర్ఆర్ఆర్ కంటే నాలుగురెట్లు వెనుకబడి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా రెండవ వారం 13 కోట్లు వసూలు చేయగా.ఎటాక్ కేవలం 3 కోట్లే వసూలు చేసింది. ఇప్పుడీ కలెక్షన్లను చూపిస్తూ..ఫ్యాన్స్ దొరికిందే సందుగా జాన్ అబ్రహం‌పై మండిపడుతున్నారు.

Also read: Tiger Nageswara Rao: రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'.. లాంచ్ చేసిన చిరంజీవి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News