Jr Ntr: జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన జూ. ఎన్టీఆర్, వీడియో వైరల్

RRR-Jr Ntr: జపాన్‌లో జూ.ఎన్టీఆర్ క్రేజీ చూస్తే మతిపోవాల్సిందే. తారక్ కు అంతలా బ్రహ్మరథం పడుతున్నారు అక్కడి అభిమానులు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తారక్ జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 08:09 AM IST
Jr Ntr: జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన జూ. ఎన్టీఆర్, వీడియో వైరల్

RRR-Jr Ntr: ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. హీరోల రేంజ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. ఇదే క్రమంలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ నటులు విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. తాజాగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా మూవీ ప్రమోషన్స్ (RRR Movie Promotions) లో భాగంగా..రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబ సమేతంగా జపాన్‌కు వెళ్లారు. అంతేకాకుండా అక్కడి వీధుల్లో చక్కెర్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

జపానీయులు ఇండియన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ మూవీస్ అంటే వారికి చాలా ఇష్టం. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు జపాన్ లో అదరణ ఎక్కువ. రజనీ తర్వాత జపాన్ లో అంత ఫాలోయింగ్ ఉన్న హీరో జూ.ఎన్టీఆర్. తారక్ డ్యాన్స్ , ఫైట్స్ కు జపాన్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.  ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా జపాన్ వెళ్లిన తారక్ (Tarak)కు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్టీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. అంతేకాకుండా కొంత మంది తమ అభిమాన నటుడు చూశామన్న ఆనందంలో కంటతడి కూడాపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ లోభాగంగా ఏర్పాటు  చేసిన ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ (Jr.NTR) జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ షాక్ కు గురి చేశారు. తారక్ ఏమాత్రం తడబడకుండా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ''అందరికీ నమస్కారం, మీరందరూ ఎలా ఉన్నారు. మిమ్మిల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాను చూసి ఎంజాయ్ చేయండి'' అంటూ ఎన్టీఆర్ జపనీస్ లో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలై వరల్డ్ వైడ్ గా 1200కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Anasuya Bharadwaj: ఫారెన్ ట్రిప్‌లో అనసూయ.. అవి తప్ప ఏం లేవంటున్న స్టార్ యాంకర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News