Saana Kastam Song: చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రలుగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య' (Acharya Movie Updates). ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల (Acharya Release Date) కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఈ సినిమా నుంచి 'శానా కష్టం' లిరికల్ సాంగ్ చిత్రబృందం విడుదల చేసింది.
"శానా కష్టం వచ్చిందే మందాకిని.. చూసే వాళ్ల కళ్లు కాకులెత్తుకుపోనీ.." అంటూ ఈ సాంగ్ స్టార్ కానుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన స్టెప్పులతో అలరించారు. ఇందులో హీరోయిన్ రెజీనా కసెండ్రా (Saana Kastam Song Heroine Name) తనదైన డ్యాన్స్ తో ఆలరించింది.
రెజీనాతో పాటు మెగాస్టార్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ను విజిల్స్ వేయిస్తున్నాయి. పాట విన్న పలువురు శ్రోతులు బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంవత్సరాలు గడిచినా.. చిరు డ్యాన్స్ లో గ్రేస్ మాత్రం తగ్గలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ఆచార్య మూవీ నుంచి విడుదలైన 'లాహే లాహే' సాంగ్ (Lahe Lahe Song) తో పాటు 'నీలాంబరి' పాటకు యూట్యూబ్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా 'నీలాంబరి' పాటలో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీతో పాటు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ (Neelambari Song Choreographer) బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్‌ను రిలీజ్ (Siddha Teaser) చేసింది చిత్రబృందం. ఇందులో చరణ్ శక్తిమంతమైన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన గెటప్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' (Acharya Movie Updates) సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ (Acharya Release Date) అవ్వనుంది. ఇందులో సంగీత, సోనూసూద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Deepthi Sunaina gets emotional : షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పడానికి కారణం చెప్పిన దీప్తి సునయన
Also Read: Bollywood: బాలీవుడ్ నటీమణుల్లో బోల్డ్ సీన్స్‌తో పాపులర్ అయిన నటీమణులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి