Sagileti Katha Movie Review: ఊహించని ట్విస్ట్‌లతో మన ముందుకు వచ్చిన సగిలేటి కథ

Sagileti Katha Movie Review In Telugu: విలేజ్ లవ్ స్టోరీ అంటే అందరికీ ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే సగిలేటి కథ విషయానికి వస్తే విలేజ్ లవ్ స్టోరీతో పాటుగా లోలోపల రివేంజ్ డ్రామాను కూడా చూపించారు. మరి ఈ సగిలేటి కథతో నవదీప్ స్క్రీన్ స్పేస్ నిలబడుతుందా? హీరో హీరోయిన్లకు మంచి పేరు వస్తుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 05:16 AM IST
Sagileti Katha Movie Review: ఊహించని ట్విస్ట్‌లతో మన ముందుకు వచ్చిన సగిలేటి కథ

Sagileti Katha Movie Review In Telugu: విలేజ్ లవ్ స్టోరీ అంటే అందరికీ ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే సగిలేటి కథ విషయానికి వస్తే విలేజ్ లవ్ స్టోరీతో పాటుగా లోలోపల రివేంజ్ డ్రామాను కూడా చూపించారు. మరి ఈ సగిలేటి కథతో నవదీప్ స్క్రీన్ స్పేస్ నిలబడుతుందా? హీరో హీరోయిన్లకు మంచి పేరు వస్తుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

కథ
రాయలసీమలోని సగిలేరు గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఊరు అన్నాక.. అన్ని రకాల మనుషులు ఉంటారు. ఆ ఊర్లో ప్రెసిడెంట్ చౌడప్ప (రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ దొరసామి (రమేష్)లు స్నేహితుల్లా ఉంటారు. చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం), దొరసామి కూతురు కృష్ణ కుమారి (విషిక కోట) ప్రేమలో పడతారు. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతా బాగుందనే సమయానికి మాంకాలమ్మ జాతర్లో దొరసామిని చౌడప్ప నరికేస్తాడు. ఆ తరువాత జరిగిన కథ ఏంటి? వీరి ప్రేమ కథ ఎలా ముందుకు సాగింది ? చివరకు వీరిద్దరూ ఒక్కటయ్యారా ? లేదా? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
కుమార్ పాత్రలో రవి చక్కగా నటించాడు. కొన్ని చోట్ల అమాయకంగా కనిపించాడు. ఇంకొన్ని చోట్ల ఎమోషనల్‌గా అనిపించాడు. పక్కింటి కుర్రాడిలా మెప్పిస్తాడు. ఇక కృష్ణ కుమారిగా విషిక అద్భుతంగా నటించింది. గడుసరి పిల్లగా, మగరాయుడిలా మెప్పించింది. అందం, నటనతో కుర్రకారును కట్టిపడేస్తుంది. మిగిలిన పాత్రలో చౌడప్ప, ఊరి ప్రెసిడెంట్ తాత, హీరో తల్లి పాత్రలు బాగున్నాయి. అన్ని కారెక్టర్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ
సగిలేటి కథ అంటే.. ఓ ఊరి కథ. ఓ ఊరు అంటే.. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ, పగలు, ద్వేషాలు, స్వార్థాలు, బడాయి మాటలు చెప్పుకుని తిరిగే వారుంటారు. చికెన్ తినాలనే చిరకాల వాంచ కలిగిన ఓ రోషగాడు కూడా ఉంటాడు. అలా అన్ని పాత్రలను చుట్టూ సగిలేటి కథను బాగానే రాసుకున్నాడు దర్శకుడు. ఆ పాత్రలను జనాలకు కనెక్ట్ చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కాకపోతే కథ పరంగా ఏమీ కొత్తగా అనిపించదు. కథనం కూడా నీరసంగా సాగినట్టు అనిపిస్తుంది.

కానీ జనాలను మాత్రం థియేటర్లో నవ్విస్తారు. ఓ రెండు గంటల పాటు కూర్చోబెట్టేస్తారు. సినిమా అంతా ఒకెత్తు అయితే చివర్లో వచ్చే ట్విస్టులు ఇంకో ఎత్తు. అప్పటి వరకు చూసిన పాత్రలకు చివర్లో కనిపించే కారెక్టర్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ అందరికీ నచ్చేలా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

ఇది కూడా చదవండి : Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో కన్నడ సూపర్ స్టార్

సగిలేటి కథ సినిమా సాంకేతికంగానూ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. గ్రామీణ వాతావరణాన్ని, 2007 బ్యాక్‌డ్రాప్‌ను బాగానే చూపించారు. మ్యూజిక్ కూడా బాగుంటుంది. చికెన్ మాత్రం అందరికీ నోరూరేలా చేస్తుంది. నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఓ మంచి ప్రయత్నం చేశారు.

రేటింగ్ 2.75 / 5

ఇది కూడా చదవండి : On The Road Movie: 'ఆన్ ది రోడ్' మూవీ టీజర్ ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News