Virupaksha : పాన్ ఇండియాకు వెళ్తోన్న విరూపాక్ష.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందా?

Virupaksha Releasing Pan India Wide విరూపాక్ష సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఇతర భాషల్లోకి డబ్ చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 08:20 PM IST
  • నెట్టింట్లో విరూపాక్ష సందడి
  • తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్
  • నార్త్‌కి వెళ్తోన్న మెగా హీరో
Virupaksha : పాన్ ఇండియాకు వెళ్తోన్న విరూపాక్ష.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందా?

Virupaksha Releasing Pan India Wide సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గత వారం విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. సుకుమార్ రైటింగ్స్‌, ఎస్వీసీసీ బ్యానర్ల మీద నిర్మించగా.. కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. ఇక సంయుక్త మీనన్‌ నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ అయింది.

విరూపాక్ష సినిమా మీద దర్శక నిర్మాతలు హీరో ఇలా అంతా కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. కార్తీక్ దండు కథ చెప్పినప్పుడే సుకుమార్ కూడా షాక్ అయ్యాడట. అయితే కొన్ని మార్పులు సూచించి స్క్రీన్ ప్లే అందించడంతో కథ ఇంకా అద్భుతంగా మారిందని కార్తీక్ దండు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కథను నెరేట్ చేసేటప్పుడే చాలా భయం వేసిందని సాయి ధరమ్ తేజ్ చెప్పిన సంగతి తెలిసిందే.

 

ఇక ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. లాభాల్లోకి విరూపాక్ష వచ్చింది. నేడు విడుదలైన రెండు సినిమాలకు (ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్‌ 2)లకు యావరేజ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విరూపాక్ష సినిమాకు మరో వారం కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఇక ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా కూడా వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమనిపిస్తోంది.

Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌

వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అవ్వడం అనేది పక్కన పెడితే.. ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మధ్య చాలా సినిమాలు పాన్ ఇండియా ట్యాగ్తో వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయలేదు. కానీ ఈ సినిమాను ఇప్పుడు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. గోల్డ్ మైన్స్ సంస్థ ఈ సినిమాను హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. తమిళంలో గ్రీన్ స్టూడియోస్ రిలీజ్ చేస్తోంది. మలయాళంలో e4 మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News