Sai Dharam Tej marriage news: సాయిధరమ్ తేజ్‌కి పెళ్లి.. అమ్మాయి కూడా ఫైనల్ ?

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలోనే టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ, రానా దగ్గుబాటి పెళ్లిళ్లు ( Tollywood celebrities marriages ) చేసుకున్న విషయం తెలిసిందే, ఇదే లాక్ డౌన్ సమయంలో మెగా ఫ్యామిలీలో కూడా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ ( Niharika engagement ) కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే సాయిధరమ్ తేజ్ పెళ్లి ( Sai Dharam Tej to tie knot soon ) చేసుకోబోతున్నాడు.

Last Updated : Oct 5, 2020, 04:17 PM IST
Sai Dharam Tej marriage news: సాయిధరమ్ తేజ్‌కి పెళ్లి.. అమ్మాయి కూడా ఫైనల్ ?

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలోనే టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ, రానా దగ్గుబాటి పెళ్లిళ్లు ( Tollywood celebrities marriages ) చేసుకున్న విషయం తెలిసిందే, ఇదే లాక్ డౌన్ సమయంలో మెగా ఫ్యామిలీలో కూడా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ ( Niharika engagement ) కూడా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో జరగబోయే నిహారిక పెళ్లికి ( Niharika wedding ) ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, మెగా ఫ్యామిలీలో మరో హీరో పెళ్లి సందడి మొదలుకాబోతోంది. 'సోలో బ్రతుకే సో బెటర్' హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి ( Sai Dharam Tej to tie knot soon ) చేసుకోబోతున్నాడు. అవును, హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సుప్రీం హీరో పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకోబోతున్నాడంట. Also read : Bigg Boss 4 Tamil contestants list: బిగ్ బాస్ 4 తమిళ్ కంటెస్టంట్స్ జాబితా.. వీళ్లలో ఒక్కొక్కరి స్పెషాలిటీ ఇది

సాయిధరమ్ తేజ్ కుటుంబం అతని కోసం ఒక అమ్మాయిని చూసిందని.. తన తల్లి నిర్ణయించిన అమ్మాయికే సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడని వార్తలొస్తున్నాయి. సాయిధరం తేజ్ ఆ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే, వాళ్ల అమ్మ తన సోదరుడు చిరంజీవికి ఆ సమాచారం ఇచ్చిందంట.. ఈ వార్త చిరుకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. అలాగే చిరుకి కూడా ఆ సంబందం బాగా నచ్చిందని తెలుస్తోంది. అందరికీ అన్నీ నచ్చడంతో సాయి ధరమ్ తేజ్ వివాహ వేడుక వచ్చే వేసవిలో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

సాయిధరం తేజ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం‘సోలో బ్రతుకే సో బెటర్’ ( Solo brathuke so better ) సినిమాతో తేజూ బిజీగా ఉన్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో తేజూ సరసన నభా నటేష్ ( Actress Nabha Natesh ) జంటగా నటిస్తోంది. ఈ సినిమా మొదట్లో డిజిటల్ ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది అని తెలిసింది, కాని ఇప్పుడు థియేటర్‌లకు అనుమతి లభించడంతో ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కి వెళ్ళకపోవచ్చు అని టాక్. ఈ సినిమాని సుబ్బు డైరెక్ట్ చేయగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిన్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  Also read : Sanjay Dutt Health Condition: సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆందోళన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News