Game Changer: గేమ్ చేంజర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతోందట!

Game Changer Update: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా రాబోతున్న గేమ్ చేంజెర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2024, 03:45 PM IST
Game Changer: గేమ్ చేంజర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతోందట!

Game Changer Teaser Update: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా అయిన వెంటనే రామ్ చరణ్ నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఆ సినిమాలో మెయిన్ హీరో చిరంజీవి కావడంతో ఆ చిత్ర డిజాస్టర్ ఎఫెక్ట్ రామ్ చరణ్ పైన పడలేదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత రామ్ చరణ్ ఫుల్ లెన్త్ హీరోగా రాబోతున్న సినిమా గేమ్ చేంజర్.

ఈ చిత్రానికి తమిళ సూపర్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉన్నాయి. కానీ ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల.. గేమ్ చేంజర్ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదని అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోందని వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం దాదాపు మూడు సంవత్సరాల పైన నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా చాలు అనుకుంటున్నారు చరణ్ అభిమానులు.

తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బయటపెట్టాడు డైలాగ్ రైటర్ సాయి మాధవ్.  ఆయన ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటపెట్టారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమా ఆ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కర్ని ఎలా పైకి తీసుకు వెళ్లిందో.. గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఈ సినిమా యూనిట్ లోని ప్రతి ఒక్కరికి అంతే పేరు తీసుకు వస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అనేక వేరియేషన్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించబోతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

‘మాస్, క్లాస్, రగ్డ్, హుందాగా.. ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో. అని వేరియేషన్స్ లో రామ్ చరణ్ పాత్ర కనిపించి మెప్పిస్తుంది. ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన పాత్రలలో ఇది హైలెట్ గా నిలుస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఈయన చెప్పిన అప్డేట్ విని రామ్ చరణ్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుకునేస్తున్నారు.

 

మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ అప్డేట్ ని మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ఇచ్చేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుందట. కాగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, ఎస్‌జె సూర్య, సముద్రఖని, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also readMahalakshmi LPG Gas Cylinder: రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై కీలక అప్డేట్.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే..

Also read: Rain Alert: ఉపరతల ఆవర్తనం ప్రభావం, తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News