Kushi Shooting: ఎట్టకేలకు విజయ్ దేవరకొండకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత

Samantha in Kushi Shooting: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూటింగ్ లో సమంత జాయిన్ అయ్యారు. ఉమెన్స్ మార్చి 8వ తేదీ అంటే నిన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మళ్ళీ ప్రారంభమవగా ఆమె జాయిన్ అయ్యారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 9, 2023, 03:38 PM IST
Kushi Shooting: ఎట్టకేలకు విజయ్ దేవరకొండకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత

Samantha Resumes Kushi Shooting: విడాకుల తర్వాత ప్రతి చిన్న విషయంతోను వార్తల్లోకి ఎక్కుతున్న సమంత కొన్నాళ్ల క్రితం తాను మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడినట్లుగా ప్రకటించింది. దీంతో ఆమె కోలుకోవాలని, మళ్లీ మామూలు మనిషి అవ్వాలని అందరూ ప్రార్థించారు. అయితే ఈ మధ్యనే మయోసైటిస్ నుంచి కోలుకున్న ఆమె ఇప్పటికే సిటాడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో కూడా పాల్గొనగా ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు.

ఉమెన్స్ మార్చి 8వ తేదీ అంటే నిన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మళ్ళీ ప్రారంభమవగా ఆ సినిమా సెట్ లో సమంత సందడి చేసింది .విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివ నిర్వాణ ఆమెను సెట్ లోకి కేక్ కటింగ్ తో ఆహ్వానించారు. ఉమెన్స్ డే వేడుకలు సెట్ లోనే జరిపారు. ఇక సమంత వెనుకే ఒక పెద్ద బ్యానర్ పెట్టిన సినిమా యూనిట్ ఆమె సినిమాలు చేయడం మొదలుపెట్టి 13 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అలాగే ఉమెన్స్ డే సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ ఖుషి సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, ఎలమంచిలి రవి ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమ కథగా రూపొందుతోంది. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన హృదయం సినిమాకి సంగీతం అందించిన అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

Also Read: Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News