Samantha Realisation : రియలైజ్ అయిన సమంత?.. తత్త్వం బోధపడినట్టుందిగా.. ఆ పోస్ట్ ఉద్దేశం అదేనా?

Samantha Shaakuntalam Failure సమంత ప్రస్తుతం దారుణాతి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. సమంత స్టామినా ఏంటో శాకుంతలం చాటి చెప్పింది. దీంతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ల మీద అందరికీ అనుమానం వచ్చేలా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 12:10 PM IST
  • నెట్టింట్లో సమంతపై నెగెటివ్ ట్రెండ్
  • శాకుంతలం సినిమాకు దారుణమైన నష్టాలు
  • రియలైజ్ అయినట్టుగా సమంత పోస్ట్
Samantha Realisation : రియలైజ్ అయిన సమంత?.. తత్త్వం బోధపడినట్టుందిగా.. ఆ పోస్ట్ ఉద్దేశం అదేనా?

Samantha Shaakuntalam Failure సంస్కృతంలో మనకు ఓ శ్లోకం ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.. మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి అని అంటారు. దాని అర్థం ఏంటంటే.. కర్మలు మాత్రమే మనం చేస్తాం.. దాని ఫలితానికి మనం అధికారులం కాదు.. ఎలాంటి ప్రతి ఫలం వచ్చినా స్వీకరించాల్సిందే.. అయినా ప్రతి ఫలాన్ని ఆశించి పనులు చేయకూడదు.. అలా అని పనులు చేయకుండా ఆపకూడదు..అని అర్థం. ఇప్పుడు సమంత ఈ శ్లోకాన్నే షేర్ చేసింది. అంటే శాకుంతలం ఫెయిల్యూర్ మీద పరోక్షంగా స్పందించినట్టు అనిపిస్తోంది.

సమంత నటించిన శాకుంతలం సినిమా ఎంతటి దారుణమైన ఫలితాన్ని మూట గట్టుకుందో అందరికీ తెలిసిందే. శాకుంతలం తీసిన గుణ శేఖర్‌ను, ఆయన ఎంచుకున్న క్యాస్టింగ్‌ను మరీ ముఖ్యంగా శాకుంతలగా సమంతను ఎందుకు ఎంచుకున్నారు? అంటూ గుణ శేఖర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సమంత కనిపించిన, నటించిన, డబ్బింగ్ చెప్పిన తీరు ట్రోలింగ్‌కు దారి తీస్తోంది.

సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే హిట్ అవుతాయ్.. డబ్బులు వస్తాయ్ అని గుడ్డిగా నమ్మే వారికి శాకుంతలం పెద్ద గుణపాఠం అని అంతా అంటున్నారు. అసలు మొహమాటినికి పోయి సినిమాలు ఒప్పుకుంటే ఇలానే అవుతుందని అంటున్నారు. సమంత కెరీర్ మీద శాకుంతలం పెద్ద మాయని మచ్చలా మిగిలిపోయేట్టుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు కూడా పది కోట్ల గ్రాస్, ఐదు కోట్ల షేర్ కూడా రాకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

ఇప్పుడు ఈ శాకుంతలం ఫెయిల్యూర్ అంతా కూడా సమంత మీదే పడింది. మామూలుగా అయితే సినిమా ఫెయిల్యూర్‌ అంతా కూడా హీరో, దర్శకుల మీద పడుతుంటుంది. శాకుంతలం సినిమాకు ముందు నుంచి సమంతే ఫేస్ ఆఫ్ ది మూవీగా మారిపోయింది. అందుకే ఇప్పుడు ట్రోలింగ్ అంతా కూడా సమంత మీదే జరుగుతోంది. ఈ ట్రోలింగ్ మీదే సమంత ఇలా పరోక్షంగా స్పందించినట్టు అనిపిస్తోంది.

 

సినిమాకు వంద శాతం న్యాయం చేయడమే తన పని అన్నట్టుగా.. సినిమా హిట్టు ఫట్టు అనేది తన చేతిలో ఉండదన్నట్టుగా.. ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రానా ఆగిపోలేమని, ముందుకు వెళ్లాల్సిందేనని, మళ్లీ సినిమా చేస్తానని సమంత చెబుతున్నట్టుగా అర్థం అవుతోంది.

Also Read: Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News