AA 23 : సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్.. ప్రభాస్ సినిమా సంగతేంటో మరి?

Allu Arjun aka AA 23 అల్లు అర్జున్ 23వ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగాతో ఈ సినిమా ఉండబోతోంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 08:34 AM IST
  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం
  • ప్రభాస్‌తో స్పిరిట్ చేయనున్న సందీప్ రెడ్డి వంగా
  • బన్నీతో బాలీవుడ్ బడా సంస్థ మూవీ
AA 23 : సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్.. ప్రభాస్ సినిమా సంగతేంటో మరి?

Sandeep Reddy Vanga Movie With Allu Arjun సందీప్ రెడ్డి వంగా ఇక్కడ అర్జున్ రెడ్డితో కల్ట్ క్లాసిక్ హిట్ కొట్టేశాడు. బాలీవుడ్‌లో అదే సినిమాను కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. అలా ఈ ఒక్క కథతోనే పాన్ ఇండియన్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు అతను రణ్‌ బీర్ కపూర్‌తో యానిమల్ అనే సినిమాను చేశాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమాను చేయాల్సి ఉంది. ఇంతలోపే సందీప్ కొత్త సినిమాను ప్రకటించాడు. అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతోన్నట్టుగా ప్రకటించేశాడు.

బన్నీ ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి పుష్ప ది రూల్‌ను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ మూవీ ఏ ఏడాది వచ్చే అవకాశాలున్నాయి. అందుకే బన్నీ తన నెక్ట్స్ సినిమా మీద కూడా ఫోకస్ పెట్టాడు. బన్నీ తదుపరి స్టెప్ ఎలా ఉంటుందా? అని అంతా అనుకున్నారు. ఎందుకంటే బన్నీకి వచ్చిన ఈ పాన్ ఇండియన్ క్రేజ్‌కు తగ్గట్టుగానే కథలను ఎంచుకుంటాడని, బాలీవుడ్ డైరెక్టర్‌తోనే సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు.

కానీ మన తెలుగు దర్శకుడితో, బాలీవుడ్ బడా సంస్థతో సినిమా ఓకే చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. టీ సిరీస్ సంస్థ మన సందీప్ రెడ్డి వంగాను ఆస్థాన దర్శకుడిగా ఫిక్స్ చేసినట్టుగా ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాను చూసి టీ సిరీస్ సంస్థ కబీర్ సింగ్‌గా అక్కడ రీమేక్ చేయించింది. ఆ తరువాత వెంటనే రణ్‌ బీర్ కపూర్‌తో యానిమల్ సినిమాను నిర్మించింది. 

 

ప్రభాస్ స్పిరిట్ సినిమాను కూడా టీ సిరీస్ సంస్థే నిర్మిస్తోంది. ఇలా సందీప్ రెడ్డి వంగా తన సినిమాలన్నీ కూడా ఆ సంస్థకే చేస్తున్నాడు. అందులో నిర్మాతగానూ భాగస్వామి అవుతున్నాడు సందీప్. అయితే ఇప్పుడు బన్నీతో సినిమాను కూడా ఓకే చేశారు. టీ సిరీస్, సందీప్ రెడ్డి వంగా, బన్నీ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కాస్త గందరగోళంలోకి వెళ్లారు.

ప్రభాస్ స్పిరిట్ అయ్యాక బన్నీ సినిమాను చేస్తాడా? లేదా? బన్నీ సినిమాను ముందు చేసి ప్రభాస్ స్పిరిట్‌ను తరువాత చేస్తాడా? అన్నది తెలియడం లేదు. డార్లింగ్ అభిమానుల్లోనూ అదే కన్ఫ్యూజన్ నెలకొంది.

Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News