Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్.. ఆ రోజే రానుందా?

Saripodhaa Sanivaaram OTT Release Day: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. మరి ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో బాగా ఆడుతుండగా.. ఓటీటీలో ఏ రోజు నుంచి ప్రత్యక్షమవుతుందో చూద్దాం పదండి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 5, 2024, 02:36 PM IST
Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్.. ఆ రోజే రానుందా?

Saripodhaa Sanivaaram OTT Release Platform: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ కం నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా, నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో ఫీట్ అందుకుంది. ముఖ్యంగా నాని -  సూర్య మధ్య.. వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా  నిలిచాయి. 

ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే దుమ్ము రేపుతోంది. మరోవైపు భారీ వర్షాలు ఉన్నా సరే కలెక్షన్లు మాత్రం జోరుగా వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇంకా సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది.  అప్పుడే ఓటీటీలోకి విడుదల చేస్తున్నామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. సరిపోదా శనివారం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 

ఫుల్ క్రేజ్ ఉన్న ఈ మూవీ హక్కులను రిలీజ్ కి కొన్ని నెలల ముందే భారీ ధరకు దక్కించుకుంది.  అందుకే ఆగస్టు 29న థియేటర్లలో విడుదల తేదీని చిత్ర బృందం మార్చలేదు. నిజానికి ఆగస్టు 15న రావాల్సిన పుష్ప2 సినిమా వాయిదా పడినా , ముందుగా రాకుండా ఓటీటీ కి ఇచ్చిన మాట ప్రకారం.. ఆగస్టు 29వ తేదీనే సరిపోదా శనివారం చిత్రం విడుదలయ్యింది.  సరిపోదా శనివారం సినిమా నెట్ఫ్లిక్స్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో  సెప్టెంబర్ 27వ తేదీ నుండి స్ట్రీమింగ్ కి రాబోతోందని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిజానికీ థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత సినిమా ఓటీటీ లోకి వస్తుంది. కానీ ఇక్కడ నాలుగు వారాలకే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేలా ఆ ఫ్లాట్ ఫామ్ డీల్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  అందుకే సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ చిత్రానికి ప్రస్తుతం కలెక్షన్లు జోరుగా వస్తున్నాయి. ఒకవేళ థియేటర్ లలో కొనసాగితే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఆలస్యం అయ్యేలా.. కనిపిస్తోంది. మరి దీనిపై మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి. మొత్తానికైతే ఈ సినిమా సెప్టెంబర్ లో  వస్తుందా రాదా అనే విషయాలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Also read: Floods Fear: విజయవాడలో మళ్లీ వరద భయం, ఇళ్లు వదిలి లాడ్జీల్లో నివాసముంటున్న ప్రజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News