సర్వం తాళమయం టీజర్.. జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాకు ఏ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్..

సర్వం తాళమయం టీజర్.. 

Last Updated : Nov 24, 2018, 01:18 PM IST
సర్వం తాళమయం టీజర్.. జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాకు ఏ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్..

సినిమాలకు మ్యూజిక్ అందిస్తూనే నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మధ్యమధ్యలో తనవంతు ప్రయత్నాలు చేస్తోన్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ మరోసారి నటుడిగా చేసిన సినిమా సర్వం తాళమయం. రాజీవ్ మీనన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో సర్వం తాళమయం పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. సంగీతమే ప్రధాన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్, రాజీవ్ మీనన్, త్యాగరాజ పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఏ.ఆర్.రెహ్మాన్, ఖుతుబ్ ఏ క్రిప బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డిసెంబర్ నెలాఖర్లో విడుదల కానున్న ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ సరసన మళయాళం నటి అపర్ణ బాలమురళి జంటగా నటించింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Trending News