తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకే అవకాశాలు కరువయ్యాయని, అవకాశం ఇచ్చిన వారు కూడా హీరోయిన్స్ పట్ల వెకిలి వేషాలు వేస్తుంటారని ఇటీవల ఓ యువ నటి సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న పలు ఆరోపణలు సోషల్ మీడియాలో, పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సంగతి తెలిసిందే. అన్నింటికిమించి టాలీవుడ్లో డీసెంట్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల గురించి ఆమె పెట్టిన పోస్ట్ మరీ వైరల్ అయిన నేపథ్యంలో ఆ పోస్టుపై ఏకంగా శేఖర్ కమ్ములనే స్పందించారు. తన గురించి ఆ పోస్టులో రాసిన అంశాలు, నిరాధారమైన ఆరోపణలు తనని, తన కుటుంబసభ్యులని, తనని అభిమానించే వారికి తీవ్ర అభ్యంతరకరంగా వున్నాయని శేఖర్ కమ్ముల ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పుడూ చూడని, కలవని, కనీసం ఫోనులో కూడా మాట్లాడని వ్యక్తి తనపై ఆరోపణలు చేయడంపై విస్మయం కలిగిస్తోందన్న ఆయన.. ఆ పోస్టుపై క్షమాపణలు చెప్పకపోతే తాను చట్టరీత్యా చర్యలకు సిద్ధం అని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.
శేఖర్ కమ్ముల ఇచ్చిన ఈ హెచ్చరికపై ఆమె ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి!!