Pathaan Collections : ఎదురులేని బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్‌ దెబ్బకు రికార్డులన్నీ ఖతమ్

Pathaan movie enter in 600 cr షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ఇప్పుడు ఆరువందల కోట్ల క్లబ్బులోకి వచ్చేసింది. ఈ చిత్రానికి ఆరు రోజుల్లోనే ఆరు వందల కోట్లు వచ్చేశాయి. అంటే రోజుకు వంద కోట్లు ఈ సినిమా రాబట్టేస్తోన్నట్టుగా అర్థమవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2023, 08:58 AM IST
  • ఊపిరి పీల్చుకుంటోన్న బాలీవుడ్
  • షారుఖ్ ఖాన్‌ మేనియాకు బాక్సాఫీస్ షేక్
  • ఆరు రోజుల్లో ఆరు వందల కోట్లు
Pathaan Collections : ఎదురులేని బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్‌ దెబ్బకు రికార్డులన్నీ ఖతమ్

Pathaan movie enter in 600 cr బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అనే పదాలకు షారుఖ్‌ ఖాన్ మాత్రమే సెట్ అవుతాడని మరోసారి చూపించేశారు. పఠాన్ సినిమాతో షారుఖ్‌ బాక్సాఫీస్ కింగ్ ఖాన్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అసలే బాలీవుడ్ పాతాళంలో ఇరుక్కుపోయింది. ఒక్క హిట్ కొట్టడానికి స్టారాదిస్టార్లు నానా తిప్పలు పడ్డారు. సల్మాన్, ఆమిర్, అమితాబ్ ఇలా పెద్ద పెద్ద వాళ్లంతా కూడా తోకలు ముడుచుకునిపోయారు. వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. 

బాలీవుడ్ ఇక ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అంతా భావించారు. అలా ఓ రెండేళ్లు బాలీవుడ్‌కు గడ్డు కాలమే నడిచింది. కానీ ఇప్పుడు షారుఖ్ మాత్రం బాలీవుడ్‌కు వెలుగుని తీసుకొచ్చాడు. పఠాన్ సినిమాతో ఊపిరి పోశాడు. ఈ సినిమా ఇప్పుడు ఆగేలా కనిపించడం లేదు. రోజుకు వంద కోట్ల చొప్పున కొల్లగొట్టేస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే కేజీయఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలవుతాయి. ఇంకాస్త నిలబడితే బాహుబలి రికార్డులు కూడా మటుమాయం అయ్యేలానే కనిపిస్తోంది.

ఇప్పటికే ఓవర్సీస్‌లో అయితే అన్ని రికార్డులు ఖతం అయ్యాయి. ఇప్పటికే అక్కడ 28.75 మిలియన్ల డాలర్లను రాబట్టేసింది. న్యూజిలాండ్‌లో మిలియన్ కొట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. పఠాన్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులను ఓవర్సీస్‌లో బద్దలు కొట్టేలా ఉంది. ఇక మొదటి వారంలోపే ఆరు వందలు కొల్లగొట్టి చాప్టర్, ఆర్ఆర్ఆర్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.

ఆరు రోజుల్లోనే ఈ సినిమాకు 680 కోట్ల గ్రాస్ వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇది జోరులో కొనసాగితే మాత్రం పఠాన్ మున్ముందు భారీ టార్గెట్‌లు పెట్టేలా కనిపిస్తోంది. పైగా ఇప్పుడు పఠాన్‌కు పోటీగా వచ్చే ఏ చిత్రం కూడా బరిలో లేదు. బాలీవుడ్ నుంచి ఏ పెద్ద సినిమా కూడా రావడం లేదు. సౌత్ నుంచి కూడా పోటీ ఇచ్చే చిత్రాలేవీ లేవు. దీంతో పఠాన్‌కు ఇప్పుడు ఎదురులేకుండా పోయింది.

Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇదే

Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News