Pathaan Tickets Rate : పఠాన్ టికెట్ రేట్లు మరీ ఇంత తక్కువా?.. బాలీవుడ్ బాద్ షా ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ

Pathaan Movie Ticket Rates పఠాన్ మూవీ టికెట్ రేట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అన్ని చోట్లా ఒకలా ఉంటే.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకోలా ఉన్నాయి. వంద రూపాయల లోపే టికెట్ రేట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 05:09 PM IST
  • నేషనల్ వైడ్‌గా షారుఖ్ ఖాన్ పఠాన్ ట్రెండింగ్
  • జనవరి 25న రాబోతోన్న బాలీవుడ్ కింగ్ ఖాన్
  • తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు హైలెట్
Pathaan Tickets Rate : పఠాన్ టికెట్ రేట్లు మరీ ఇంత తక్కువా?.. బాలీవుడ్ బాద్ షా ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ

Pathaan Movie Ticket Rates బాలీవుడ్‌ బాద్ షా పఠాన్ సినిమాతో దేశ వ్యాప్తంగా జనవరి 25న సందడి చేయబోతోన్నాడు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో పఠాన్ దుమ్ములేపేస్తోంది. లక్షల టికెట్లు అమ్ముడుపోతోన్నాయి. మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసేలా ఉంది. ఇక ఇప్పుడు పఠాన్ మూవీ టికెట్ రేట్ల మీద చర్చలు నడుస్తున్నాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో రేటుతో పఠాన్ మూవీ రిలీజ్ అవుతోంది.

చాలా చోట్ల టిక్కెట్ ధర గరిష్టంగా రూ. 2100గా ఉండగా.. కొన్ని చోట్ల రూ. 55, రూ. 88కి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఎక్కడ అని అంతా కూడా ఆశ్చర్యపోతారేమో. అది మన హైద్రాబాద్‌లోనే, అందులోనూ దేవీ థియేటర్లో. హైదరాబాద్‌లోని 'దేవి' థియేటర్‌లో 55 నుండి 88 రూపాయలు చెల్లించి పఠాన్ చిత్రాన్ని చూడొచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ చిత్రాన్ని 4k లేజర్, డాల్బీ అట్మాస్‌లో కూడా చూడవచ్చు, కాకపోతే అది హైదరాబాదీలకు మాత్రమే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని షారుక్ అభిమానులకు ఇది కచ్చితంగా ఖుషీ ఇచ్చే వార్త అవుతుంది. అయితే ఢిల్లీలో కూడా రూ.88కే షారూఖ్-దీపికల సినిమా చూసే అవకాశం లభిస్తుందట. కరోల్ బాగ్‌లోని లిబర్టీ సినిమా వద్ద 'పఠాన్' 2D నాన్-ఐమాక్స్ వెర్షన్ టిక్కెట్ కేవలం రూ. 88గా ఉందట. 

ఇక ముంబైలో టిక్కెట్ల ధర రూ. 180 పైన ఉండగా.. కోల్‌కతాలో రూ. 200 పైన ఉందని తెలుస్తోంది. అక్కడే కొన్ని చోట్ల టిక్కెట్ ధర రికార్డులన్నీ బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. 'పఠాన్' కోసం రూ.2100 చెల్లించేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అసలే చాలా ఏళ్ల తరువాత మళ్లీ షారుఖ్ సిల్వర్ స్క్రీన్ మీద విజృంభించబోతోన్నాడు. మరి ఈ సినిమా అయినా షారుఖ్‌కి సక్సెస్ ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?

Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News