Shriya Saran Hot Pics: గ్లామర్ డోస్ పెంచిన శ్రియా సరన్.. లేటు వయసులో ఘాటు అందాలు!

Shriya Saran Latest black dress Pictures Goes Viral. శ్రియా సరన్ నిత్యం రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోశారు.    

Written by - P Sampath Kumar | Last Updated : Oct 6, 2022, 09:36 PM IST
  • గ్లామర్ డోస్ పెంచిన శ్రియా సరన్
  • లేటు వయసులో ఘాటు అందాలు
  • బ్లాక్ డ్రెస్సులో శ్రియా ఎద అందాలు
Shriya Saran Hot Pics: గ్లామర్ డోస్ పెంచిన శ్రియా సరన్.. లేటు వయసులో ఘాటు అందాలు!

Actress Shriya Saran looks very hot in black short dress: 1982 సెప్టెంబరు 11న ఉత్తరాఖండ్‌లో శ్రియా సరన్ జన్మించారు. ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. 

 'ఇష్టం' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయారు. నువ్వే నువ్వే, ఠాగూర్, సంతోషం, నేనున్నాను, అర్జున్, బాలు, మనం, చత్రపతి లాంటి హిట్ సినిమాలు శ్రియా ఖాతాలో ఉన్నాయి. 

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నటసింహం బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, లవర్ బాయ్ తరుణ్ లాంటి హీరోలతో జతకట్టారు. 

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రియా.. చాలా గ్యాప్ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కనిపించారు. 

2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌‌ని రహస్యంగా పెళ్లిచేసుకున్నారు శ్రియా. పెళ్లి విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. ఇక గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన శ్రియా.. గతేడాది అక్టోబర్‌లో కూతురు పుట్టిందని ప్రకటించి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. 

ఇటీవలి కాలంలో శ్రియా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నారు. నిత్యం రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోశారు.  

Also Read: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఎనమిది నగరాల్లో 5జీ ప్లస్‌ సేవలు!

Also Read: ఆ పేసర్ టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో లేకపోవడంతో షాక్ అయ్యా: బ్రెట్‌ లీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

 

 

Trending News