Sidhu Moosewala New Song out now: గత ఏడాది కొంతమంది దుండగులు చేతిలో దుర్మరణం పాలైన పంజాబీ సింగర్ సిద్దు మూసే వాలా పాడిన కొత్త సాంగ్ రిలీజ్ అయింది. సిద్దు మూసే వాలా గాత్రానికి నైజీరియన్ సింగర్ బర్నా బాయ్ రాప్ అందించిన ఈ సాంగ్ సిద్దు మూసే వాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో వీడియోతో సహా ఏప్రిల్ ఏడవ తేదీన విడుదలైంది.
ఈ సాంగ్ మొత్తం సిద్దు మూసే వాలాకి ఏర్పడిన ఒక మంచి ఫేం అలాగే ఆయనకు వచ్చిన మంచి పేరుతో సిటీలో ఎక్కడపడితే అక్కడ ఆయనకు ఏర్పాటు చేసిన కటౌట్లు, బిల్ బోర్డుల గురించి ప్రస్తావించారు ఈ వీడియోలో. అలాగే ఆయన అభిమానులు గోడలకు సిద్ధూ పిక్చర్లు పెయింట్ చేయడం, ఆయన ఫోటోలు గోడలకు అతికించడం,వ్ వాహనాలకు అతికించడం కూడా కనిపిస్తోంది. అయితే అంది వచ్చిన టెక్నాలజీతో ఈ వీడియోలో సిద్దు మూసే వాలా కూడా కనిపించినట్లుగా మ్యాజిక్ చేశారు.
Also Read: Telugu OTT Releases This Week: 2 కోట్లు పెడితే 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో అంటే?
అంతేకాక కెనడియన్ రాపర్ డ్రేక్ సిద్దు మూసే వాలా ఫొటో ఉన్న షర్టు ధరించిన వీడియో కూడా కనిపిస్తోంది. ఇక వీడియో చివరిలో సిద్దు మూసే వాలా మరణానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నట్లుగా చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సిద్దు మూసే వాలా యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో రిలీజ్ చేసి ఈ ఆర్టికల్ రాసినప్పటికీ ఐదు గంటలు అవుతుంటే ఐదు గంటల్లోనే ఐదున్నర మిలియన్ వ్యూస్ సాధించింది.
దాదాపుగా 1.4 మిలియన్ లైక్ సాధించిన ఈ సాంగ్ కి 665 వేల కామెంట్లు వచ్చాయి. ఇక పంజాబ్ లోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సిద్ధూ పంజాబీ సాంగ్స్ పాడుతూ యూట్యూబ్ లో వాటిని అప్లోడ్ చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే అనూహ్యంగా తన గ్రామం నుంచి వేరే చోటకు ప్రయాణిస్తున్న సమయంలో ఆయన మీద బుల్లెట్ల వర్షం కురిపించారు కొందరు దుండగులు, ఈ బుల్లెట్ల దాడిలో సిద్దు మూసే వాలా దుర్మరణం పాలయ్యాడు.
Also Read: Where is Pushpa: కట్టప్ప మిస్టరీలా పుష్ప ఎక్కడ? సుక్కూ ప్లానింగ్ అదుర్స్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook