Sita Ramam - Malliswari: సీతా రామం - మల్లీశ్వరి సినిమాల మధ్య ఈ పోలికను మీరు గమనించారా?

Similarities Between Sita Ramam and Malliswari Movies: సీతా రామం - మల్లీశ్వరి సినిమాల మధ్య ఈ పోలికను మీరు గమనించారా? ఒకవేళ గమనించక పోతే ఈ ఆర్టికల్ చదివేయండి!

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 10, 2022, 02:56 PM IST
Sita Ramam - Malliswari: సీతా రామం - మల్లీశ్వరి సినిమాల మధ్య ఈ పోలికను మీరు గమనించారా?

Similarities Between Sita Ramam and Malliswari Movies: ఇటీవల విడుదలైన మా సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్, గౌతం మీనన్, రష్మిక మందన, సుమంత్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా కూడా అందుబాటులోకి వచ్చింది.

బడ్జెట్ కి మించి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ప్రేక్షకులు అనేక ఆసక్తికరమైన అంశాలను తెరమీదకు తీసుకొస్తున్నారు. సినిమా డిజిటల్ వేదికగా విడుదలైన నేపథ్యంలో అనేక విషయాలను గుర్తుపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్, కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాతో పోలి ఉందంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని నెటిజన్లు తెర మీదకు తీసుకురావడమే కాకుండా వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు.

ఇంతకీ ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలిక ఏమిటంటే మల్లీశ్వరి సినిమాలో జమిందార్ వారసురాలు మల్లీశ్వరి పెళ్లికాని ప్రసాదుతో అనుకోకుండా ప్రేమలో పడుతుంది. ఆమె కంటే ముందే ప్రేమలో పడిన ప్రసాదు ఎలా అయినా ఆమెను దక్కించుకోవడం కోసం మల్లీశ్వరి జమీందారు ఇంట్లో జీతానికి పనిచేసే అమ్మాయి అనుకుని తన జీతం, తాను కొనబోయే ఇంటికి సంబంధించిన ఆఫర్లను ఆమె ముందు పెడతాడు.

సరిగ్గా అదే రీతిలో సీతారామం సినిమాలో కూడా రామ్(దుల్కర్ సల్మాన్) సీతామహాలక్ష్మి(మృణాల్ ఠాకూర్) నూర్జహాన్ ప్యాలెస్ లో పనిచేసే ఒక డ్యాన్స్ టీచర్ అని అనుకుని ఆమెకు తన జీవితం 600 రూపాయలు అని ఇల్లు కొనుక్కుందామని ఆమె ముందు ప్రపోజల్స్ పెడతాడు. ఇక ఈ రెండు పోలికలను చెబుతూ వీడియోలను చేసి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Also Read: Brahmastram Collections: తెలుగు రాష్ట్రాల రికార్డులు బద్దలు.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

Also Read: Directors Acted in Sita Ramam: సీతారామం సినిమాలో తొమ్మిది మంది డైరెక్టర్లు... వారిని అబ్జర్వ్ చేశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News