Singer Sunitha wedding: ఘనంగా సింగర్ సునీత రెండో పెళ్లి

ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనితో శనివారం రాత్రి సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.

Last Updated : Jan 10, 2021, 08:47 AM IST
Singer Sunitha wedding: ఘనంగా సింగర్ సునీత రెండో పెళ్లి

ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనితో శనివారం రాత్రి సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో సింగర్ సునీత, రామ్ వీరపనేనిల వివాహం జరిగింది. 

గతంలో కిరణ్‌ని పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో ఆయనతో డైవర్స్ తీసుకుని తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు. 43 ఏళ్ల సునీతకు మునుపటి వివాహం ద్వారా ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఇద్దరూ చదువు పూర్తి చేసి, వృత్తిలో నిలదొక్కుకునే పనిలో బిజీ అయ్యారు.

ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు, ప్రమోషన్‌ యాక్టివిటీస్ నిర్వహించే డిజిటల్ మీడియా సంస్థకు రామ్ వీరపనేని ( Ram Veerapaneni ) సీఈఓగా వ్యవహరిస్తున్నారు. సునీత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కూడా రామ్ వీరపనేనికి చెందిన డిజిటల్ మీడియా ప్రమోషన్స్ సంస్థనే నిర్వహిస్తున్న కారణంగా ఆ ఇద్దరి మధ్య చాలాకాలంగా పరిచయం ఉంది. ఒకరికొకరు బాగా తెలుసు. రామ్ కూడా తన మొదటి భార్య నుండి చాలా కాలం క్రితమే డైవర్స్ తీసుకున్నారు. రామ్‌కి పిల్లలు లేరు.

Also read : Singer Sunitha haldi ceremony photos: సింగర్ సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు 

తెలుగు సినీ పరిశ్రమలోని అందమైన గాయనీమణులలో సింగర్ సునీత ( Singer Sunitha ) కూడా ఒకరు. సింగర్ సునీత వాయిస్ అంటే ఇష్టపడని వారు లేరు. ఆమె తన పాటలతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Also read : Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News