Sonakshi Sinha in Chiranjeevi film : చిరంజీవి సినిమాలో సోనాక్షి సిన్హా ?

మెగా స్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలల నుంచి ఆచార్య మూవీ షూటింగ్ ఆగిపోయింది.

Last Updated : Sep 19, 2020, 10:24 PM IST
Sonakshi Sinha in Chiranjeevi film : చిరంజీవి సినిమాలో సోనాక్షి సిన్హా ?

మెగా స్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలల నుంచి ఆచార్య మూవీ షూటింగ్ ఆగిపోయింది. నవంబర్‌ నుండి తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, అలాగే ఇంకా 70 శాతం కంటే ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి కావలసి ఉంది అని తెలుస్తోంది. Also read : Kangana Ranaut lauds Tollywood: బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఇండస్ట్రీనే పెద్దది: కంగనా రనౌత్

Acharya movie shooting పూర్తయిన తర్వాత, చిరు లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. ప్రస్తుతం, డైరక్టర్ వివి వినాయక్ లూసిఫర్ స్క్రిప్టుని తెలుగు ఆడియెన్స్‌ అభిరుచికి అనుగుణంగా మలుచుకుని, త్వరలో స్క్రిప్టుని ఫైనల్ చేయనున్నాడు. తాజాగా టాలివుడ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించనుందని తెలుస్తోంది. Also read : Kids Video: నెట్టింట సందడి చేస్తోన్న పిల్లల సినిమాటిక్ ఫైట్ వీడియోలు

మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్‌ ఒరిజినల్ సినిమాలో అసలు హీరోయిన్ పాత్ర లేనే లేదు. కానీ, తెలుగులో రీమేక్ చేయబోతున్న ( Lucifer Telugu remake ) డైరెక్టర్ వి.వి.వినాయక్ మాత్రం మెగాస్టార్ అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో హీరొయిన్ కోసం ఒక చిన్న పాత్రతో పాటు ఒక సాంగ్‌ను కూడా జోడించాలనుకుంటున్నట్టు ఫిలింనగర్ టాక్. ఆ పాత్రలోనే సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha to romance Chiranjeevi ) నటించనుందనే టాక్ వినిపిస్తోంది. కానీ అందుకు సంబందించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. Also read : KBC 12: సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం, ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా

Trending News