Kangana Ranaut lauds Telugu film industry: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుంచి కంగనా రనౌత్ పేరు వార్తల్లో మార్మోగని రోజు లేదు. సుశాంత్ మృతికి ( Sushant Singh Rajput death case ) బాలీవుడ్ పరిశ్రమలోని కొంతమంది పెద్దల వైఖరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్.. ఆ తర్వాత అదే బాలీవుడ్ పెద్దలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వం సుశాంత్ మృతి కేసు విచారణను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించడమే కాకుండా అనునిత్యం మహారాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలతో ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరిస్తోంది. Also read : Sumedha death issue: సుమేధ మృతికి కారకులు ఎవరు ? ఆ పాపం ఎవరిది ? స్థానికుల ఆగ్రహం
ఇదిలావుంటే, తాజాగా కంగనా రనౌత్ చేసిన మరో ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ట్వీట్‌లో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని ( PM Narendra Modi ) ట్విట్టర్‌లో ట్యాగ్ చేసిన కంగనా.. అన్ని ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమలను వేరువేరుగా కాకుండా ఒక్కటిగా చూడాలని కోరింది. భారతదేశంలో అగ్రశ్రేణి చిత్ర పరిశ్రమ అంటే హిందీ చిత్ర పరిశ్రమ ( Hindi film industry ) అని అందరు అనుకుంటారు కానీ అది తప్పు అని, ఇపుడు టాలీవుడ్ సినీ పరిశ్రమ ( Telugu film industry ) అగ్రస్థానానికి చేరుకుందని కంగనా ట్వీట్ చేశారు. ఏటా టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తుందని చెప్పారు. ఎన్నో బాలీవుడ్ సినిమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలీంసిటీలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయని కంగనా తన ట్వీట్‌లో పేర్కొంది. Also read : Mayanti Langer: ఈ ఐపీఎల్‌లో ఆమె యాంకరింగ్ లేనట్టే.. ఎందుకంటే?
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అతిపెద్ద ఫిలీం సిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ట్వీట్ చేసిన సందర్భంగా కంగనా రనౌత్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించింది. సినీ పరిశ్రమలో చాలా మార్పులు రావాలని... అన్ని సినీ ఇండస్ట్రీలు కలిసి భారతీయ చిత్ర పరిశ్రమగా మారాలని కంగనా వ్యాఖ్యానించారు. అన్ని చిత్ర పరిశ్రమలు వేరువేరుగా ఉండడం వల్ల హాలీవుడ్ లాభపడుతుంది అని వెల్లడించారు. Also read : Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్
అలాగే నేపోటిజం, డ్రగ్ మాఫియా, సెక్సిజం, టెర్రరిజం, మత, ప్రాంతీయ ఉగ్రవాదం, విదేశీ సినిమాల ఉగ్రవాదం, పైరసీ ఉగ్రవాదం, కార్మిక దోపిడీ, ప్రతిభ దోపిడీ ( Nepotsm, Drugs mafia, sexism, Terrorism, Piracy, exploitation ) లాంటి అనేక ఉగ్రవాదుల నుండి చిత్ర పరిశ్రమను కాపాడాలి అని కంగనా రనౌత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో చర్చనియాంశమైంది. Also read : Jr NTR as producer నిర్మాతగా మారుతున్న ఎన్టీఆర్ ?
Kangana Ranaut lauds Tollywood: బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఇండస్ట్రీనే పెద్దది: కంగనా రనౌత్