Sonu Sood Bicycle Ride: ఆచార్య షూటింగ్ సెట్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్, మూవీ యూనిట్ షాక్

Sonu Sood Bicycle Ride: సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ రియల్ లైఫ్‌లో అసలైన హీరో అని నిరూపించుకున్నాడు. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలో వలస కూలీలు, దినసరి కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా వారి ఇళ్లకు చేరడానికి చేరడంలో సహాయం చేశాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 14, 2021, 06:35 PM IST
  • టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య
  • ఆచార్య మూవీ షూటింగ్ స్పాట్‌కు సైకిల్‌పై వెళ్లిన నటుడు సోనూ సూద్
  • దుర్గం చెరువుపై సైకిల్ తొక్కుతున్న సోనూ సూద్ వీడియో వైరల్
Sonu Sood Bicycle Ride: ఆచార్య షూటింగ్ సెట్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్, మూవీ యూనిట్ షాక్

సోనూ సూద్.. ఇది భారతదేశంలో ఓ పేరు కాదు మానవత్వానికి బ్రాండ్‌గా మారింది. సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ రియల్ లైఫ్‌లో అసలైన హీరో అని నిరూపించుకున్నాడు. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలో వలస కూలీలు, దినసరి కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా వారి ఇళ్లకు చేరడానికి బస్సులు, విమానాలు, రైళ్లు సర్వీసులు కల్పించి ఇంటికి చేరడంలో సహాయం చేశాడు.

తాజాగా సోనూ సూద్ మరోసారి వార్తల్లోకెక్కాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య మూవీ షూటింగ్‌కు కారులో కాకుండా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అయిన సోనూసూద్ ఎంచక్కా సైకిల్ తొక్కుకుంటూ ఆచార్య షూటింగ్‌ సెట్‌కు వెళ్లి మూవీ యూనిట్‌కు షాకిచ్చాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న ఆచార్య మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే. దుర్గం చెరువు బ్రిడ్జిపై సోనూ సూద్(Sonu Sood) సైకిల్ తొక్కుతున్న వీడియో ట్రెండింగ్‌గా మారింది.

Also Read: Malaika Arora Engagement: మలైకా అరోరా ఎంగేజ్‌మెంట్ జరిగిందా, డైమండ్ రింగ్ వైరల్

టాలీవుడ్‌లో విలన్లు సైతం హీరోల్లా కనిపించడం సోనూసూద్ లాంటి నటుడు అలవాటు చేశాడని చెప్పవచ్చు. వ్యాయామం, శారీరక శ్రమ చేసి సోనూ సూద్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటాడు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఆచార్య(Acharya Movie) మూవీ షూటింగ్ స్పాట్‌కు సైకిల్‌పై వెళ్లాడు. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది.

Also Read: Jr Ntr movie: జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివతోనే..విడుదల తేదీ కూడా ఖరారు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News