Action King Arjun: సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి తెలియని వారు. స్వతహాగా కన్నడ వాడైన తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా దాదాపు 4 దశాబ్దాలుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా అర్జున్ కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. మన్నెంలో మొనగాడు. మా పల్లెలో గోపాలుడు, త్రిమూర్తులు, శ్రీ ఆంజనేయం, హనుమాన్ జంక్షన్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఈయన కీర్తి కిరిటంలో మరో కలికితురాయి చేరింది. తాజాగా అర్జున్ సర్జను ఎంజీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా హీరోగా నటించిన బహుభాషా నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా.. నిర్మాతగా పలు ఉత్తమ చిత్రాలను నిర్మించారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. రియల్ లైఫ్ లో ఆధ్యాత్మికంగా సామాజిక పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. హీరోగా 150 సినిమాల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అందులో ఎన్నో ఇండస్ట్రీ మూవీస్ ఉన్నాయి.
తెలుగులో కూడా తనదైన శైలిలో విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాదు కేవలం హీరోగా నటిస్తూనే విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అర్జున్ ను గౌరవ డాక్టరేట్ వరించడం చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈయన సొంత డబ్బులతో చెన్నైలో ఓ హనుమాన్ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. అంతేకాదు సినీ, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో రాణిస్తూ దూసుకుపోతున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter.