South Indian Directors With Zero Flop: సినిమా షూటింగ్‌కు కొబ్బరి కాయ కొట్టిన దగ్గర నుంచి థియేటర్ స్క్రీన్‌లో బొమ్మ పడే వరకు మొత్తం బాధ్యతలను తన భూజాల మీదకు వేసుకుని నడిపించేది దర్శకుడు. మూవీని బ్లాక్‌బస్టర్ హిట్ చేసినా.. అట్టర్ ఫ్లాప్ చేసినా మొదటి బాధ్యుడు డైరెక్టరే. గతంలో హీరోలను చూసి సినిమాకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం తీరు మారింది. ముందు ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అని ఆరా తీస్తున్నారు. ఫలానా డైరెక్టర్ అయితే సినిమా మినిమమ్ గ్యారంటీ హిట్ ఉంటుందని నమ్మకంతో ఉంటున్నారు. వరుస సూపర్ హిట్స్‌తో కొందరు దర్శకులు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేకుండా కొందరు డైరెక్టర్లు దూసుకుపోతున్నారు. వాళ్లు ఎవరో తెలుసుకుందాం పదండి.
తెలుగులో ఓటమి ఎరుగని దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం రాజమౌలళి. స్టూడెంట్ నెం.1 మూవీతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన జక్కన్న.. ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తీసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి షేక్ చేశాయి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్‌ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ సైతం అందుకుని రికార్డులు సృష్టించింది. నెక్ట్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు మూవీని తెరకెక్కించనున్నాడు.
ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా జవాన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ.129 కోట్లు రాబట్టి.. భారీ వసూళ్ల దిశగా దూసుకువెళుతోంది. ఈ మూవీకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. అట్లీ కెరీర్‌లో ఒక్క మూవీ కూడా ఫ్లాప్ లేదు. తొలి సినిమా 'రాజా రాణి'తో సరికొత్త ప్రేమ కథను పరిచయం చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత తెరి, మెర్సెల్ (తెలుగులో అదిరింది), బిగిల్ (విజిల్), ఇప్పుడు జవాన్ సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించాడు. ఈ సినిమాలు అన్ని బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించాయి.
మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ వరుసగా హిట్స్‌తో జోష్‌లో ఉన్నాడు. మా నగరం మూవీతో సూపర్ హిట్ ఖాతా ఓపెన్ చేసి.. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్లను అందించాడు. త్వరలో లియో చిత్రంతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. మలయాళం స్టార్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినా.. ఆ తరువాత దర్శకుడిగా మారిపోయారు. కుంజి రామాయణం, గోదా, మిన్నల్ మురళి వంటి సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించాడు. సమీర్ తాహిర్, అంజలి మేనన్, గీతూ మోహన్ దాస్ తదితర దర్శకులు వరుస హిట్స్ అందించారు. కన్నడలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజ్ బి.శెట్టి, రిషబ్ శెట్టి సూపర్ హిట్స్ అందుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి